సినిమా వార్తలు

‘కూలీ’ డైరెక్టర్ హీరోగా ఎంట్రీ…హీరోయిన్ ఎవరో తెలుసా? షాక్ అప్‌డేట్!

సూపర్ హిట్ ‘కూలీ’ తరవాత డైరెక్షన్‌కు చిన్న బ్రేక్ ఇచ్చి… హీరోగా రాబోతున్నాడు తమిళ మాస్ మేకర్ లోకేశ్ కనగరాజ్. ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేసిన మాస్టర్‌మైండ్ ఇప్పుడు స్వయంగా స్క్రీన్‌పైకి అడుగు పెడుతుండటంతో కోలీవుడ్, టాలీవుడ్‌లో టాక్!

ఈ ఇంటెన్స్ యాక్షన్ డ్రామాకు ‘రాకీ’, ‘సాణి కాయిదం’, ‘కెప్టెన్ మిల్లర్’ డైరెక్టర్ అరుణ్ మాథేశ్వరన్ మెగాఫోన్ పట్టుకున్నాడు. సన్ పిక్చర్స్, లోకేశ్‌ స్వంత బ్యానర్ G Squad తో కలిసి ఈ భారీ ప్రాజెక్ట్‌ను బోర్డ్‌పైకి తీసుకొచ్చాయి. షూటింగ్ నిశ్శబ్దంగా స్టార్ట్ కూడా చేసేశారు.

( Photos : Instagram )

ఇక హీరోయిన్‌గా ఎవరు?

అందరికి షాక్ ఇస్తూ… బాలీవుడ్‌లో గ్లామర్ & ఇన్టెన్స్ పర్ఫార్మెన్స్‌తో పేరు తెచ్చుకున్న వామికా గబ్బిని లాక్ చేశారు. ‘గరుడ 2’ (G2)లో అదివి శేష్ సరసన కనిపించనున్న వామికా ఇప్పుడు లోకేశ్ హీరోగా చేసే మొదటి సినిమాలోనూ హాట్ చాయిస్ అయింది.

మొదట రచితా రామ్ పేరే వినిపించింది కానీ, ఫైనల్‌గా వామికానే ఫిక్స్ అయినట్టు బలమైన బజ్. ఈ సినిమా గ్యాంగ్‌స్టర్ అట్మాస్ఫియర్‌లో ప్యూర్ రా యాక్షన్ ఎమోషన్‌తో నడుస్తుందట… అండ్ రూమర్స్ ప్రకారం లోకేశ్ ఇక్కడ పూర్తిగా న్యూ అవతారంలో కనిపిస్తారట!

లోకేశ్ ట్రాక్ రికార్డు

‘ఖైదీ’ – కార్తీ

‘మాస్టర్’, ‘లియో’ – విజయ్

‘విక్రమ్’ – కమల్ హాసన్

‘కూలీ’ – రజనీకాంత్

ఇంత స్టార్స్‌తో పనిచేసిన డైరెక్టర్ ఇప్పుడు స్వయంగా హీరోగా వస్తుండటంతో… ఈసారి మాస్ కాదు… మ్యాడ్‌నెస్ లెవెల్ ఏంటో చూడాలి!

వామికా సౌత్‌లో క్యారెక్టర్ డ్రైవెన్ రోల్స్‌తో ఇమేజ్ బిల్డ్ చేస్తోంది

టాలీవుడ్‌లో ‘G2’, ఇప్పుడు లోకేశ్ మూవీ… అలాగే తమిళ & పంజాబీ ప్రాజెక్ట్స్‌తో ఫుల్ హవా. సరైన హిట్స్ వస్తే సౌత్‌లో రోల్ డామినేట్ చేసే హీరోయిన్‌ గా మారిపోవచ్చు!

Similar Posts