సక్సెస్ ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్’ చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. పార్ట్ 1కు ఉన్న క్రేజ్‌తో ‘మ్యాడ్ స్క్వేర్’కు మంచి బజ్ వచ్చింది. దీంతో పాటు విడుదలైన టీజర్, ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో ఇదొక ఫన్ ఎంటర్‌టైనర్ అనే అంచనాలు ఆడియన్స్‌లో ఉన్నాయి.
ఇక ఈ రోజు థియేటర్‌లోకి వచ్చిన ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ పూర్తిగా చేయలేకపోయింది. ఆడియన్స్ అంచనాలకు రీచ్ కాలేదు. డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి ఎంత బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ రావాలంటే ఎంత రావాలో చూద్దాం.
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న లెక్కలు ప్రకారం….
నైజాం 6.00 కోట్లు
సీడెడ్ 2.00 కోట్లు
ఆంధ్ర(టోటల్) 7.00 కోట్లు
ఏపీ + తెలంగాణ(టోటల్) 15.00 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా 2.00 కోట్లు
ఓవర్సీస్ 3.00 కోట్లు
వరల్డ్ వైడ్ (టోటల్) 20.00 కోట్లు(షేర్)
‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square) సినిమాకు రూ.20 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.21 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.