1990వ దశకంలో భారతీయ చిత్రపరిశ్రమలో మమతా కులకర్ణి ఓ వెలుగు వెలిగింది. బోల్డ్ క్యారెక్టర్స్‌కు పెట్టింది పేరుగా నిలిచిన ఆమె తన అందంతో బాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేసింది. ఒంటిపై బట్టలు లేకుండా ‘డస్ట్ మ్యాగజైన్’ కవర్ పేజీలకు ఫోజులిచ్చింది. ఈ ఫొటో షూట్‌ అప్పట్లో ఇండస్ట్రీని షేక్‌ చేసింది.

హీరోయిన్‌గానే కాకుండా ఐటెమ్ సాంగ్స్‌తోనూ అభిమానులను అలరించింది. కెరియర్‌లో ఫుల్‌ బిజీగా ఉన్న సమయంలో విక్కీ గోస్వామిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత డ్రగ్స్ కేసులో మమతా కులకర్ణి అరెస్ట్‌ అయ్యింది. ఆ తర్వాత జైలు నుంచి విడుదలైంది. ఇప్పుడు ఆమె సన్యాసినిగా మారింది. ఈ మేరకు తాను సన్యాసిని గా మారానంటూ సోషల్ మీడియాలో ప్రకటన చేసింది.

మమతా కులకర్ణి జనవరి 24న కిన్నార్ అఖారాలో ‘మహామండలేశ్వర్’గా ప్రమాణం చేయనున్నారు. శుక్రవారం సాయంత్రం సంగం వద్ద మమత ‘పిండ్ దాన్’ ఆచారాన్ని నిర్వహించనున్నారు.

ABPలోని ఒక నివేదిక ప్రకారం, ఆమె పట్టాభిషేక కార్యక్రమం కిన్నార్ అఖారాలో జరుగుతుంది. అలాగే ఈరోజు నుంచి ఆమెకు కొత్త పేరు కూడా పెడుతున్నారు. ఆమె ఇప్పుడు ‘శ్రీ యమై మమతా నంద్ గిరి’గా పిలవబడుతుంది.

2016 జనవరిలో కెన్యాలో జరిగిన సమావేశానికి మమతా కులకర్ణి హాజరైందని.. నిందితుడు అయిన భర్త విక్కీ గోస్వామి తదితరులతో సమావేశంలో చర్చల్లో పాల్గొన్నారని పోలీసులు ఆరోపించారు.

నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (NDPS) చట్టం కింద 2016లో థానే పోలీసులు తనపై నమోదు చేసిన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (FIR)ను రద్దు చేయాలని 2018లో మమతా కులకర్ణి హైకోర్టును ఆశ్రయించారు.

దీనిపై విచారణ జరిపిన కోర్టు గత ఆగస్టులో మాజీ హీరోయిన్‌కు క్లీన్‌ చీట్‌ ఇచ్చింది. 2016లో నటిపై నమోదైన డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ కేసును హైకోర్టు కొట్టివేసిన కోర్టు.. మమతా కులకర్ణిపై చర్యలు విచారకమని చెప్పింది.

ఈ కేసులో విచారణను కొనసాగించడం కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేయడమే తప్ప మరోటి కాదని జస్టిస్‌ భారతి డాంగ్రే, మంజుషా దేశ్‌పాండే ధర్మాసనం స్పష్టం చేసింది.

#Mamta Kulkarni, #Sanyasi

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *