మంచు విష్ణు హీరోగా నటిస్తూ, భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమా ‘కన్నప్ప’. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ లాంటి స్టార్ హీరోలు ఇందులో అతిథి పాత్రలు చేశారు. మోహన్ బాబు, కాజల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కన్నప్ప సినిమా మీద మొదట్లో ట్రోలింగ్ ఎక్కువే! మంచు విష్ణు అంత పెద్ద కాస్ట్ ని ఎలా డీల్ చేస్తాడు ? ప్రభాస్ ఎంత సేపు కనిపిస్తాడు? అక్షయ్ కుమార్ నిజంగా వచ్చాడా లేక ఏదైనా వీడియో గెస్ట్ Appearance తీరులో ఉందా? అన్న అనుమానాలే ఎక్కువగా వినిపించాయి.

కానీ… కన్నప్ప ట్రైలర్ వచ్చాక ఇప్పుడు ఆ టోన్ మొత్తం మారిపోయినట్టే కనిపిస్తోంది! కంటెంట్ మీద ట్రోలింగ్‌కి స్కోప్ తగ్గింది… బజ్, బిలీవ్ రెండు పెరిగిపోయాయి. జూన్ 27న థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్ర ఈవెంట్ తాజాగా కొచ్చిలో నిర్వహించారు. అక్కడే మోహన్ లాల్ చేతుల మీదుగా ఇప్పుడు ట్రైలర్‌ని రిలీజ్ చేశారు.

ట్రైలర్ రివ్యూ

దాదాపు మూడున్నర నిమిషాల పాటు సాగిన ఈ ట్రైలర్… స్కేల్‌, విజువల్స్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లతో అట్టహాసంగా అనిపించింది. కథకు సంబంధించిన స్పాయిలర్‌లు లేకుండా కట్ చేయడం, సినిమాలో ఏముంటుందో ఓ హింట్ ఇవ్వడం – ఈ రెండు విషయాల్లో టీం బాగా కేర్ తీసుకున్నట్టే కనిపిస్తోంది.

ఇక మంచు విష్ణు పాత్ర – తిన్నడు. ఓ పల్లెటూరులో దేవుడ్ని పట్టించుకోకుండా తిరిగే వ్యక్తి. కొన్ని సంఘటనల వల్ల ఊరు వదిలి వెళతాడు. అదే టైంలో ప్రేమలో పడతాడు. అక్కడినుంచి రుద్ర (ప్రభాస్), శివుడు (అక్షయ్ కుమార్) రంగంలోకి దిగుతారు. ఆ తర్వాత తిన్నడు శివుడికి ఎలా అంకితభావంతో మారిపోయాడు? వాయు లింగం కథలో ఎలా కీలకం అవుతుంది? అన్నది ఆసక్తికరంగా చూపించారు.

విజువల్స్… హై లెవెల్‌లోనే ఉన్నాయి. విఎఫ్ఎక్స్ డిపార్ట్‌మెంట్ మంచి పని చేసినట్టు అనిపిస్తోంది. కానీ, బాహుబలి, సాహో లాంటి వార్ ఎపిసోడ్స్ చూసిన ప్రేక్షకులకు ఇది ఏ మేరకు సాటిరాయగలదో చూడాలి.

స్టార్ క్యాస్ట్ విషయానికి వస్తే –

ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ చక్కగా ఉంది. అయితే ఫ్యాన్స్ ఊహించినంత పవర్‌ఫుల్‌గా రుద్ర పాత్రను చూపించలేదు. బహుశా సినిమా కోసం కొన్ని షాట్లు దాచి ఉండివచ్చు.

మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్, మోహన్ బాబు – అందరూ కనిపించారు. గెస్ట్ రోల్స్ అయినా.. స్క్రీన్ ప్రెజన్స్ లు బలంగా ఉన్నాయి.

ప్రీతి ముకుందన్ – హీరోయిన్‌గా సింపుల్‌గా, రొమాంటిక్ టచ్‌తో కనిపించింది.

సినిమా న్యూజిలాండ్‌లో షూట్ చేయడం, అదే లొకేషన్‌ను వేరే వేరే మూడ్‌లతో మలచడం వల్ల, ఒకే ప్లేస్‌లో సినిమా మొత్తం జరిగిందా? అనే ఫీల్ కొంతమందిలో కలిగినా, ప్రొడక్షన్ వాల్యూస్‌పై మాత్రం సందేహమే లేదు.

మొత్తంగా చెప్పాలంటే,

కన్నప్ప మీద మిగిలిన ట్రోలింగ్ శాతం తగ్గించే ప్రయత్నం ఈ ట్రైలర్ తో బాగానే వర్కౌట్ అయింది. విష్ణు సినిమాని కంటెంట్‌తో కాదు, స్టార్స్‌తో వర్కౌట్ చేయిస్తున్నాడు అన్న విమర్శకు – “ఇది కంటెంట్‌తో కూడిన స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్” అనే సమాధానం ఇచ్చే ప్రయత్నమే ఈ ట్రైలర్. ఇక సినిమా ఆ ఎక్స్‌పెక్టేషన్‌ను మెయిన్‌టైన్ చేస్తుందా? అన్నది జూన్ 27 తర్వాత తెలుస్తుంది!

, , , , , ,
You may also like
Latest Posts from