మణిరత్నం పేరులోనే వైబ్రేషన్ ఉంటుంది అంటారు అభిమానులు. ఆయనకు తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలో వీరాభిమానులు ఉన్నారు. దర్శకుడిగా ఎందరికో ఆయన ప్రేరణ. ఆయన దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టి దాదాపు 30 సంవత్సరాలు దాటినా.. ఆయన చేసిన సినిమాలు చాలా తక్కువే అయినా అభిమానుల సంఖ్యంకు కొదవలేదు. క్వాంటిటీ కన్నా క్వాలిటీ ముఖ్యం అని నమ్మే అతి కొద్ది దర్శకుల్లో ఆయన ఒకరు.
మణిరత్నం ఏదో విదేశాలకు వెళ్లి ఫిలిం కోర్సు చేశానని అనుకుంటారు. కానీ ఆయన ఎలాంటి కోర్సు పూర్తిచేయలేదు. నిజం చెప్పాలంటే సినీ పరిశ్రమకు వచ్చే నాటికి ఆయనకు దర్శకత్వం అంటే ఏమో కూడా తెలియదు. పట్టుదలతో ఏదైనా నేర్చుకుంటే వస్తుందనే నమ్మకంతోనే ఒక సినిమాకు దర్శకత్వం వహించారు. అలా ఆ రోజు ధైర్యం చేశారు.
కానీ ఆ రోజు నుంచి ఈ రోజు ప్రతి రోజు ఏదో ఒకటి నేర్చుకుంటూనే దర్శకత్వం చేస్తున్నారు.. ప్రతి సినిమా మొదటి సినిమాలాగా కష్టపడాల్సిందే అని ఆయన చెప్తూంటారు.
ఇక మణిరత్నం తన కెరీర్ లో ఎన్నో రొమాంటిక్ చిత్రాలు తీసారు. రొమాంటిక్ చిత్రాలకు ఆయన కేరాఫ్ ఎడ్రస్ అనే చెప్పాలి. ముఖ్యంగా రొమాన్స్ అంటేనే సఖి సినిమా.. మణిరత్నం అలా తీశారు. సఖి సినిమా గురించి ఎంత చెప్పిన తక్కువే.. అలా ఉంటుంది సినిమా. అలాంటి మణిరత్నం ఇప్పుడు కమల్ తో కలిసి థగ్ లైఫ్ తీస్తున్నారు.
ప్రస్తుతం మణిరత్నం విశ్వ నటుడు కమల్ హాసన్ హీరోగా థగ్ లైఫ్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. అనంతరం మణిరత్నం కొత్త ప్రాజెక్ట్ పనుల్లో బిజీ కానున్నారు.
థగ్ లైఫ్ రిలీజ్ అనంతరం ఓ చిన్న బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కిస్తానని ప్రకటించారు. ఇక్కడ మరో సర్ ప్రైజ్ విషయం ఏంటి అంటే ఆ సినిమాలో హీరో, హీరోయిన్లు అంతా కొత్త వారే. ఈ మేరకు ఆయన ఆడిషన్స్ కూడా చేస్తున్నారు.