ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన ‘ఛావా’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. బాలీవుడ్ ట్రేడ్ చెప్పేదాన్ని బట్టి ఇప్పటిదాకా దాదాపుగా రూ.700 కోట్లు రాబట్టిందని తెలుస్తోంది. లాంగ్ రన్‌లో ఈజీగా రూ.1000 కోట్ల వసూళ్లను నమోదు చేయబోతుంది అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు చాలా నమ్మకంగా ఉన్నారు.
ఈ సినిమాకు మూడో వారంలోనూ విపరీతమైన ప్రేక్షక ఆధరణ చూసి అంతా షాక్ అవుతున్నారు. ఛావా సినిమా థియేటర్‌లలో క్లైమాక్స్ చూసి ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అయితే అదే సమయంలో ఈ సినిమాని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకోవటం లేదు. అలాంటివారిని శిక్షిస్తున్నారు కూడా.
రీసెంట్ గా నార్త్‌లోని ఒక థియేటర్‌లో ఛావా సినిమా క్లైమాక్స్‌ను ప్రేక్షకులు అంతా లీనం అయ్యి సీరియస్‌గా చూస్తున్నారు. కొందరు ఏకంగా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఆ థియేటర్‌లోనే కొందరు ఆకతాయిలు సినిమా ఆరంభం నుంచి జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు.
ముఖ్యంగా క్లైమాక్స్ సమయంలో ఏడుస్తున్న ప్రేక్షకులను చూసి ఆ ఆకతాయిలు నవ్వారు. ఎగతాళిగా మాట్లాడారు. దాంతో సినిమా పూర్తి అయిన తర్వాత వారిని బయటకు తీసుకు వచ్చి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి వారితో క్షమాపణలు చెప్పించారు. చెంపలు వేయించారు. అంతే కాకుండా జై శివాజీ మహారాజ్, జై శంభాజీ మహారాజ్ అంటూ నినాదాలు చేయించారు.