తేజ సజ్జా – కార్తీక్ ఘట్టమనేని కాంబోలో వచ్చిన మిరాయ్ పై రిలీజ్‌కు ముందే అంచనాలు ఆకాశాన్నంటాయి. హనుమాన్ బ్లాక్‌బస్టర్ విజయంతో తేజ సజ్జా పేరు మీదే బలమైన బజ్ క్రియేట్ అయ్యింది. ట్రైలర్, టీజర్‌లు హాలీవుడ్ రేంజ్ విజువల్స్‌తో ప్రేక్షకుల్లో భారీ హైప్ తెచ్చాయి. ఫాంటసీ + యాక్షన్ + ఎమోషన్ మిక్స్‌తో కొత్త అనుభూతి ఇస్తుందన్న అంచనాలు పెరిగాయి. ప్రత్యేకంగా యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ కోసం హైలైట్ అవుతుందన్న టాక్ ఫిల్మ్ నగర్‌లో జోరుగా వినిపించింది. ఈ అంచనాలన్నీ కలిసి మిరాయ్ కి రిస్క్ లేకుండా బాక్సాఫీస్ వద్ద సేఫ్ గేమ్ అని అప్పుడే ఫిక్స్ అయ్యాయి.

అనుకున్నట్లుగానే మిరాయ్ భాక్సాఫీస్‌లో అద్భుతమైన దూకుడు చూపిస్తోంది. కేవలం 5 రోజుల్లోనే ₹100 కోట్ల మార్క్ దాటేసి ట్రేడ్ సర్కిల్స్ షాక్ అవుతున్నారు.

5 రోజుల్లో 100 కోట్లు!

రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో పటాపంచలాడినమిరాయ్—

Day 1: బలమైన ఓపెనింగ్
Day 2: కలెక్షన్లలో బిగ్ జంప్
Day 5: వంద కోట్ల క్లబ్‌లో ఎంట్రీ

అమెరికాలో కూడా …

North Americaలో $2 మిలియన్ దాటేసింది
Hanumanతర్వాత తేజ వరుసగా రెండోసారి 2 మిలియన్ మైలురాయి

ఫ్యామిలీ ఆడియెన్స్ క్యూలో!

మంగళవారం ఒక్కరోజే BMSలో1 లక్ష టికెట్లు బుక్కావడం సినిమాకు ఉన్న క్రేజ్‌ని చూపిస్తోంది. యూత్ మాత్రమే కాదు, ఫ్యామిలీస్ కూడా థియేటర్లకు క్యూ కడుతున్నారు.

డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని మ్యాజిక్

తక్కువ బడ్జెట్‌తో హాలీవుడ్ రేంజ్ విజువల్స్ క్రియేట్ చేసి, యాక్షన్–ఎమోషన్–ఫాంటసీని కలిపి చూపించిన తీరు సినీ వర్గాల్లో హాట్ టాపిక్.

హనుమాన్ తర్వాత మిరాయ్ తోనూ వరుస బ్లాక్‌బస్టర్లు కొట్టిన తేజ సజ్జా… ఇప్పుడు టాప్ హీరోలకు కంపిటీషన్ ఇస్తున్నాడని ఫిల్మ్ నగర్ టాక్.

రాబోయే రోజుల్లోమిరాయ్ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి… కానీ ఒక విషయం క్లియర్ —తెలుగు సినిమా నేషనల్ లెవెల్‌లో గర్వంగా నిలిచింది!

, , , , ,
You may also like
Latest Posts from