కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జా, రితికా నాయక్‌ జంటగా నటించిన చిత్రం ‘మిరాయ్‌’. మనోజ్‌ మంచు, జగపతిబాబు, శ్రియా శరణ్‌ ఇతరపాత్రలు పోషించారు. టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 12న విడుదల కానుంది.ఇప్పటికే రిలీజైన ట్రైలర్ కు మంచి క్రేజ్ వచ్చింది. ఈ క్రమంలో మిరాయ్ సినిమా మీద ఆడియన్స్ తో పాటు ట్రేడ్ సర్కిల్స్‌లో కూడా మంచి బజ్ క్రియేట్ అయింది.

ఈ హైప్ ని దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు తెలివిగా వ్యవహరించారు. తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ ను ₹24.5 కోట్లకు అమ్మేశారు. ఈ నిర్ణయం వల్ల సినిమాకు ఇప్పటికే లాభాలు వచ్చేశాయి. సాధారణంగా ఇంత బజ్ ఉన్న సినిమాలకు ప్రొడ్యూసర్లు చాలా ఎక్కువ రేటుకే డీల్ క్లోజ్ చేస్తారు. కానీ మిరాయ్ మేకర్స్ మాత్రం బయ్యర్స్ కి రిస్క్ లేకుండా, రీజనబుల్ ప్రైస్ కి డీల్ ఫిక్స్ చేశారు.

ఈ డీల్ ప్రకారం వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ సుమారు 25 కోట్లు. అంటే బయ్యర్స్ కి కూడా ఇది సేఫ్ జోన్ అన్నమాట. ఇక సినిమాకి మొత్తం బడ్జెట్ సుమారు ₹60 కోట్లు. అయితే నాన్-థియేట్రికల్ రైట్స్ (ఓటీటీ, శాటిలైట్, మ్యూజిక్ వంటివి) ద్వారా మేకర్స్ ఇప్పటికే భారీగా వసూలు చేశారు. దీంతో ఈ సినిమాపై ప్రొడ్యూసర్లకు మంచి ప్రాఫిట్స్ వచ్చేశాయి.

సింపుల్‌గా చెప్పాలంటే మిరాయ్ రిలీజ్ కి ముందే సేఫ్‌లోకి వెళ్లిపోయింది!

, , , , , , , ,
You may also like
Latest Posts from