సినిమా వార్తలు

సమంత–రాజ్‌ పెళ్లి తర్వాత నాగ చైతన్య షేర్ చేసిన పోస్ట్ వైరల్! ఏమన్నాడో తెలుసా?

స్టార్ హీరోయిన్ సమంత , నాగ చైతన్య నుండి విడాకులు తీసుకున్న తర్వాత, డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో డిసెంబర్ 1, 2025న వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తమిళనాడులోని కోయంబత్తూరు ఈశా యోగా సెంటర్‌లోని లింగ భైరవి ఆలయం వద్ద నిర్వహించిన భూత శుద్ధి వివాహం విధానం ప్రస్తుతం భారీ చర్చనీయాంశం అవుతోంది.

రాజ్ నిడిమోరు కూడా ఇంతకుముందు శ్యామలి దే ను వివాహం చేసుకున్నారు. ఆమె ‘రంగ్ దే బసంతీ’, ‘ఓంకారా’ వంటి చిత్రాల్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు.

సామ్ పెళ్లి తర్వాత చైతు పోస్ట్ — నెటిజన్లలో హాట్ టాపిక్!

సమంత–రాజ్ పెళ్లి జరిగిన కొద్ది గంటల్లోనే, నాగ చైతన్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఎందుకంటే నాగచైతన్య..రేర్ గా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూంటారు. ఈ క్రమంలో ఆయన పెట్టిన పోస్ట్ పై అందరి దృష్టీ పడింది.

చైతన్య తన OTT డెబ్యూ సిరీస్ ‘దూత’ విడుదలైన రెండేళ్లను పురస్కరించుకుని ఫొటో షేర్ చేస్తూ ఇలా రాశాడు:

“దూత నాకు చూపించింది… ఒక నటుడిగా మీరు నిజాయితీగా, క్రియేటివిటీ ఆధారంగా తీసుకున్న నిర్ణయం పట్ల 100% కట్టుబడి పనిచేస్తే, ప్రజలు అది అర్ధం చేసుకుంటారు. మీ ఎనర్జీకి వారు స్పందిస్తారు. థ్యాంక్యూ! 2 ఇయర్స్ ఆఫ్ దూత! ఈ ప్రయాణంలో భాగమైన నా టీమ్‌కు ప్రేమతో.”

సమంత పెళ్లి జరిగిన టైమ్‌కే ఈ పోస్ట్ రావడంతో, నెటిజన్లు దీనికి వివిధ రకాల అర్థాలు తీస్తున్నారు. ఇప్పుడే ఈ పోస్ట్ పెట్టడంలో అర్దం ఏమిటనేది హాట్ టాపిక్ గా మారింది. సమంత పెళ్లికు ఈ పోస్ట్ కు ఏదో లింక్ ఉందంటున్నారు. డీకోడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకీ దీని అర్దం ఏమిటంటారు?

Similar Posts