నాగ చైత‌న్య(Naga Chaitanya) హీరోగా చందూ మొండేటి(Chandoo Mondeti) ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న సినిమా తండేల్(Thandel). గీతా ఆర్ట్స్2(Geetha Arts2) బ్యాన‌ర్ భారీ బ‌డ్జెట్ తో పాన్ ఇండియా స్దాయిలో రూపొందిన ఈ సినిమాలో సాయి ప‌ల్ల‌వి(Sai Pallavi) హీరోయిన్. చైతూ కెరీర్లోనే హ‌య్యెస్ట్ బడ్జెట్ తో చెప్బబడుతున్న ఈ సినిమాపై అంద‌రికీ భారీ అంచ‌నాలున్నాయి. ఫిబ్ర‌వ‌రి 7న తండేల్ ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ చిత్రం బడ్జెట్ ఎంత.

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ‘తండేల్’ చిత్రాన్ని ‘గీతా ఆర్ట్స్’ సంస్థ రూ.70 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.

నాగ చైతన్య కెరీర్లోనే ఇది హైయెస్ట్ బడ్జెట్ మూవీ . దీంతో ట్రేడ్ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే ‘తండేల్’ కి కాంబినేషనల్ క్రేజ్ ఉంది. అందువల్ల నాన్ థియేట్రికల్ బిజినెస్ బాగా జరిగింది.

‘తండేల్’ డిజిటల్ రైట్స్ ను(అన్ని భాషలు కలుపుకుని) నెట్ ఫ్లిక్స్ సంస్థ రూ.40 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

అలాగే ఆడియో రైట్స్ రూ.10 కోట్లకి అమ్ముడయ్యాయట. కాబట్టి పెట్టిన బడ్జెట్లో సగం పైనే రికవరీ సాధించినట్టే..! థియేట్రికల్ గా రూ.20 కోట్లు వచ్చినా సినిమా సేఫ్ అయినట్టే.!

, , , ,
You may also like
Latest Posts from