ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన సినిమా యూఐ రిలీజ్ కు ముందు ఎంతో ఆసక్తిని రేపింది. అందుకు తగ్గట్లే భారీ ఎత్తున ఈ సినిమా డిసెంబర్ 20న గ్రాండ్ పాన్ ఇండియా లెవల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా విడుదలైంది. అయితే అంచనాలకు తగ్గట్టుగా సినిమా లేకపోవటంతో రిలీజైన మరుసటి రోజు నుంచే కలెక్షన్స్ డ్రాప్ మొదలైంది. కాకపోతే సాధారణ ప్రేక్షకులకు పెద్దగా ఆక్టటుకోలేకపోయినప్పటికీ ఉప్పీ అభిమానులను యూఐ సినిమా తెగ నచ్చేసింది. దీంతో కన్నడ బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు వసూళ్లనే రాబట్టింది. రీసెంట్ గా ఓటిటిలోకి ఈ చిత్రం వచ్చేసింది.
ఈ క్రమంలో ఒకసారి (UI The Movie) క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం 0.57 cr
సీడెడ్ 0.19 cr
ఆంధ్ర(టోటల్) 0.54 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 1.30 cr
UI’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.1.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.1.5 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేయాలి.
ఫుల్ రన్లో ఈ సినిమా రూ.1.3 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి జస్ట్ ఓకే అనిపించింది.