ప్రతి హీరో కెరీర్‌లో 100వ సినిమా అనేది ఒక గొప్ప మైలు రాయి. అది ఓ సెలబ్రేషన్, ఓ స్వీయ చరిత్ర. స్టార్ డైరెక్టర్లు, భారీ బడ్జెట్ స్క్రిప్ట్స్, ఇండస్ట్రీలో హడావుడి — ఇవన్నీ ఒక హీరో 100వ సినిమా కోసం పరిశీలించే అంశాలు. చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్స్ తమ వందో సినిమాల విషయంలో కూడా ఈ ఫార్ములాని పాటించారు. కానీ… నాగార్జున మాత్రం మరో దారి పట్టారు!

లాస్ట్ ఇయిర్ సంక్రాంతికి ‘నా సామిరంగ’తో మెప్పించిన నాగార్జున ప్రస్తుతం ధనుష్‌ ‘కుబేర’, రజినీకాంత్‌ ‘కూలీ’ వంటి ప్యాన్ ఇండియా సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాంటి సమయంలో… అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఆయన వందో సినిమా పై తాజా బజ్ ఆసక్తిని రేపుతోంది.

సినిమా ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, నాగార్జున తన వందో సినిమా కోసం తమిళ దర్శకుడు రా. కార్తీక్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

వినడానికి సాధారణంగానే ఉన్నా… ఇది నిజానికి ఒక ధైర్య నిర్ణయం. ఎందుకంటే రా. కార్తీక్ ఇప్పటి వరకు కేవలం ఒక్క సినిమా మాత్రమే చేశాడు — ‘నితమ్ ఒరు వానం’ (తెలుగులో ‘ఆకాశం’). ఓ క్లాసీ, ఫీల్-గుడ్ రొమాంటిక్ డ్రామా చేసిన ఈ దర్శకుడితో నాగార్జున తన మైలురాయిని చేయాలనుకోవడం ఒక డేర్‌డెవిల్ నిర్ణయం!

ఎందుకీ రిస్క్? నాగ్ స్టైల్ అనేది ఇది!

ఇది మొదటిసారి కాదు. యువ దర్శకులను ప్రోత్సహించడంలో నాగార్జున ఎప్పుడూ ముందుండేవారు. కొత్త కంటెంట్, కొత్త టెక్నిక్స్, ఫ్రెష్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం అతను ఎప్పుడూ ఓపెన్‌గానే ఉంటారు. ఇప్పుడు అదే మార్గాన్ని తన 100వ సినిమా విషయంలో కూడా కొనసాగిస్తున్నారు.

వందో సినిమా కాదు, విజయానికి కొత్త ఆరంభం!
ఒకవేళ ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటైతే, ఇది కేవలం వందో సినిమా మాత్రమే కాదు — నాగార్జున కథా ప్రయాణానికి కొత్త అధ్యాయం. ఒక క్లాసీ ఎమోషనల్ జర్నీకి తగిన కథను ఓ కొత్త దర్శకుడి నుంచి ఎంచుకోవడం, ప్రేక్షకుల కోసం కొత్త అనుభూతిని అందించాలనే జిజ్ఞాసనే సూచిస్తుంది.

,
You may also like
Latest Posts from