ఒక్కొక్క హీరోకి ఒకే సెంటిమెంట్ ఉంటుంది. అదే విధంగా హీరోకు కొన్ని సెంటిమెంట్స్ ఉండాలి. ప్రస్తుతం హిట్‌ 3, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలతో బిజీగా ఉన్నాడు నాని. తాజాగా ‘ది ప్యారడైజ్‌’ (The Paradise) ప్రత్యేక వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 26న ప్రేక్షకుల ముందుకురానున్నట్లు తెలిపారు. దీంతో నెటిజన్లు ఓ ఇంట్రస్టింగ్ విషయాన్ని షేర్‌ చేస్తున్నారు. నాని తన సినిమాల విషయంలో గురువారం సెంటిమెంట్‌ ఫాలో అవుతున్నారని కామెంట్‌ చేస్తున్నారు.

నాని కెరీర్‌లోనే ‘దసరా’ సూపర్‌ హిట్‌గా నిలిచింది. భారీ వసూళ్లను కూడా సొంతం చేసుకుంది. ఈ సినిమా 2023 మార్చి 30న గురువారం ప్రేక్షకుల ముందుకువచ్చింది. దీని తర్వాత వచ్చిన నాని చిత్రాలు కూడా గురువారమే విడుదలయ్యాయి. హాయ్‌ నాన్న (2023 డిసెంబర్‌ 7), సరిపోదా శనివారం (2024 ఆగస్టు 29) తర్వాత లైనప్‌లో ఉన్న చిత్రం ‘హిట్‌-3’ ఈ ఏడాది మే 1న విడుదల కానుంది. ఆ రోజు కూడా గురువారమే.

దీని తర్వాత వచ్చే ఏడాది విడుదల కానున్న ‘ది ప్యారడైజ్‌’ కూడా ఆ వారమే రిలీజ్‌ కానుంది. దీంతో నాని గురువారం సెంటిమెంట్‌ను బాగా ఫాలో అవుతున్నారని ఎక్స్‌లో పోస్ట్‌లు కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో రానున్న సినిమాలకు కూడా ఇదే సెంటిమెంట్ ఫాలో అవుతూ బ్లాక్‌బస్టర్‌ విజయాలు సొంతం చేసుకోవాలని కోరుతున్నారు.

హీరో నానిన్ ‘దసరా’లో ఊరమాస్‌ అవతారంలో చూపించి ప్రేక్షకుల్ని మెప్పించారు దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల. ఇప్పుడాయన ‘ది ప్యారడైజ్‌’తో (The Paradise) నానిని మరో కొత్త అవతారంలో తెరపై చూపించేందుకు సిద్ధమవుతున్నారు. ‘దసరా’ తర్వాత వీళ్లిద్దరి కలయికలో రూపొందుతున్న సినిమా సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు.

‘రా స్టేట్‌మెంట్‌’ పేరుతో ఓ వీడియో విడుదల చేశారు. ఈ టైటిల్‌కు తగ్గట్లుగానే ప్రచార చిత్రంలో వినిపించిన సంభాషణలు.. నాని లుక్కు.. గెటప్పు.. అన్నీ ఊరనాటుగా ఉన్నాయి. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషలతో పాటు ఇంగ్లిష్, స్పానిష్‌ లాంటి విదేశీ భాషల్లోనూ వచ్చే ఏడాది మార్చి 26న విడుదల కానుంది.

, ,
You may also like
Latest Posts from