కొన్ని కాంబినేషన్స్ ఇంట్రస్టింగ్ గా ఉంటాయి. అలాంటివాటిల్లో కార్తీక్ సుబ్బరాజ్, నాని కాంబినేషన్ కూడా ఒకటి. కార్తీక్‌ సుబ్బరాజ్( Karthiksubbaraj) మూవీస్ చూస్తే..పిజ్జా, జగమే తంత్రం, మహాన్, పెట్టా, జిగర్తాండ, ఇప్పుడు జిగర్ తండ డబుల్ X. ఇప్పుడు రెట్రో వీటిని చూస్తే ఇట్టే అర్థమవుతుంది..అతనెంత విలక్షణమైన దర్శకుడో. అలాగే నాని కూడా చాలా విలక్షణమైన కథలతో ముందుకు వెల్తున్నాడు.

అందులో భాగంగా తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్‌తో నాని చర్చలు జరుపుతున్నాడట. కార్తీక్ తనతో ఓ ఇంట్రెస్టింగ్ ఐడియా షేర్ చేశాడని.. దానిని ముందుకు ఎలా తీసుకెళ్లాలనే అంశంపై చర్చిస్తున్నట్లు నాని చెప్పుకొచ్చాడు.

కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించే సినిమాలు తనకు చాలా బాగా నచ్చుతాయని నాని తెలిపాడు. కాగా కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేసిన ‘రెట్రో’ మూవీ కూడా మే 1న రిలీజ్ అవుతుండటంతో ఆ సినిమా కూడా బాగా ఆడాలని నాని కోరాడు. ఇక త్వరలోనే ఈ కాంబోకి సంబంధించి ఓ అఫీషియల్ అప్డేట్ రావచ్చని అభిమానులు ఆశిస్తున్నారు.

నాని ప్రస్తుతం హిట్ 3 ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియాగా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అందుకే ముంబై, కొచ్చి, చెన్నై అంటూ నాని తిరుగుతూనే ఉన్నాడు. నాని, శ్రీనిధి శెట్టి కలిసి హిట్ 3ని ప్రమోట్ చేస్తున్నారు.

నాని ప్రస్తుతం పారడైజ్ మూవీని చేస్తున్నాడు. దీని తరువాత సుజిత్‌తో ఓ మూవీని చేయాల్సి ఉంది. ఇక ఇవి కాకుండా ఇంకొంత మంది దర్శకుల్ని నిత్యం టచ్‌లోనే ఉంటున్నాడట.

, ,
You may also like
Latest Posts from