నాని మరోసారి మాస్ మంత్రం జపించాటానికి వచ్చేసాడు. నాని తనకు ‘దసరా’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరో ఊర మాస్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి ‘ది ప్యారడైస్’ అనే టైటిల్ కన్ఫామ్ చేశారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేసారు.

సోనాలి కులకర్ణి కీలక పాత్రలో కనిపించనున్నారు. సికింద్రాబాద్‌ నేపథ్యంలో సాగే కథగా దీనిని రూపొందిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇది షూటింగ్ దశలో ఉంది. అంటూ సాగిన ఈ ‘ది ప్యారడైజ్‌ రా స్టేట్‌మెంట్‌’ వైల్డ్‌గా సాగింది.

ఈ గ్లింప్స్ లో చరిత్రలో అందరు చిలుకలు, పావురాలు గురించి రాసిన్రు కానీ.. అదే జాతిలో పుట్టిన కాకుల గురించి రాయలే. అందులో కడుపు మండిన కాకుల కథ. జమానా జమానా కెళ్లి నడిచే శవాల కథ. అమ్ము రొమ్ములో పాలు లేక.. రక్తం పోసి పెంచిన ఓ జాతి కథ. ఒక దగడ్ వచ్చి మొత్తం జాతిలో జోష్ తెచ్చిండు. తూ అనిపించుకున్న కాకులు.. తల్వార్లు పట్టినయ్.. ఇది కాకులను ఒక్కటి చేసిన ఒక లంజా కొడుకు కథ అని మొత్తంగా గ్లింప్స్ తోనే సినిమాపై హైప్ పెంచాడు.

నాని (Nani)లుక్, డైలాగులు సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తించాయి. వచ్చే ఏడాది మార్చి 26న ఈ సినిమా విడుదల కానుంది. ఎస్‌.ఎల్‌.వి సినిమాస్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతం సమకూరుస్తున్నారు.

, , ,
You may also like
Latest Posts from