ఎమోషన్‌తో, ఎనర్జీతో నిండిన ‘భైరవం’ ఈవెంట్ ఏలూరులో ఘనంగా ముగిసింది. కానీ ఆ సాయంత్రం ప్రేక్షకుల గుండెల్లో నిలిచిన అసలైన మలుపు – మంచు మనోజ్ మాట్లాడిన మాటలు! ఈ ఈవెంట్‌లో తన జీవితంలోని చీకటి కోణాలను తెరవచెప్పిన మనోజ్ మౌనంగా ఉన్న బాధను గళం తీసి మాట్లాడాడు.
“సొంత వాళ్లే దూరం పెట్టిన ఈ రోజుల్లో మీరు నన్ను ఒడికి తీసుకున్నారు… కట్టె కాలే వరకు నేను మోహన్‌బాబు కుమారుడినే” అని చెప్పిన మాటలు వేడెక్కించాయి.
ఈ మాటలు విన్న నారా రోహిత్ స్పందించకుండా ఉండలేకపోయాడు. తను సోషల్‌మీడియాలో పోస్టు చేస్తూ,
“ఈ ఈవెంట్‌ను ప్రత్యేకంగా మార్చిన ఏలూరు ప్రజలకు ధన్యవాదాలు. బాబాయ్ (మంచు మనోజ్) స్పీచ్ హృదయాన్ని హత్తుకునేలా, పవర్‌ఫుల్‌గా ఉంది. నీవుంటే నేను ఉన్నా బాబాయ్. లవ్ యూ,”
అని ఎమోషనల్‌గా రియాక్ట్ అయ్యాడు.
‘భైరవం’ చిత్రంలో రోహిత్, మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించగా, కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్నారు. కథానాయికలుగా ఆనంది, అదితి శంకర్, దివ్య పిళ్ళై కనిపించబోతున్నారు. మే 30న ఈ ప్యాన్ ఇండియా యాక్షన్ డ్రామా విడుదల కానుంది.