ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ ల కలయికలో వచ్చిన భారీ చిత్రం “పుష్ప 2 ది రూల్”. ఈ చిత్రం రిలీజ్ అయ్యి రికార్డు వసూళ్లు థియేటర్స్ లో అందుకోగా ఇపుడు ఫైనల్ గా ఓటిటి ఎంట్రీ కూడా ఇచ్చేసింది. ఈ చిత్రాన్ని దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా ఇపుడు ఈ సినిమా ఫైనల్ గా స్ట్రీమింగ్ కి వచ్చేసింది. అయితే ఈ సినిమా రావడంలో కూడా నెట్ ప్లిక్స్ ఫ్యాన్స్ పండగ చేసుకునే విధంగా ప్రమోట్ చేస్తోంది.

ఇండియా నెట్ ఫ్లిక్స్ సోషల్ మీడియా వారు బన్నీ మాస్ క్రేజ్ ఏంటో చూపించారు. తమ ఇంస్టాగ్రామ్ బయోలో తమ అకౌంట్ ఇపుడు నుంచి పుష్ప గాడి రూల్ లో ఉందని మాస్ ఎలివేషన్ అందించారు.

గతంలో కూడా అల్లు అర్జున్ కి నెట్ ఫ్లిక్స్ వారు ఇదే తరహాలో తాము ఫ్యాన్ పేజీ అన్నట్టుగా కూడా క్రేజీ పోస్ట్స్ పెట్టడం జరిగింది. దీనితో ఈ పోస్ట్ ఇపుడు మంచి వైరల్ గా మారింది.

నెట్ ఫ్లిక్స్ ఏమందంటే.. సహా పుష్ప చిత్రం ఒక్క కన్నడ మినహా మిగతా నాలుగు భాషలు తెలుగు, హిందీ, తమిళ్, మళయాళంలో సినిమా ప్రస్తుతం అందుబాటులో ఉందని కన్నడ తర్వాత యాడ్ చేస్తామని తెలిపారు.

నెట్ ఫ్లిక్స్ లో డౌన్లోడ్ వెర్షన్ కి కేవలం పుష్ప 2 ఇపుడు తెలుగు, హిందీ, తమిళ్ లో మాత్రమే అందుబాటులో కనిపిస్తుంది. దీనితో డౌన్లోడ్ చేసుకునేవారికి ఇదొక ట్విస్ట్.

పుష్ప 2 ది రూల్ రీలోడెడ్ వెర్షన్ ఇపుడు వస్తే ఇది కాకుండా పుష్ప 2 ది రూల్ 3 గంటల 20 నిమిషాల వెర్షన్ ని కూడా నెట్ ఫ్లిక్స్ తీసుకురానున్నట్టుగా తెలుస్తుంది.

, , , , ,
You may also like
Latest Posts from