2021లో విడుదలై ఎవరూ ఊహించని సక్సెస్ ని అందుకుంది ‘స్క్విడ్ గేమ్’ (Squid Game) వెబ్‌సిరీస్. రిలీజైన 27 రోజుల్లోనే 111 మిలియన్‌కి పైగా వ్యూస్ దక్కించుకుని రికార్డ్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా భారత్‌లోనూ ఈ కొరియన్ సిరీస్‌కు మంచి ఆదరణ దక్కింది. దానికి సీక్వెల్‌గా రూపొందిన ‘స్క్విడ్ గేమ్ 2’ గతేడాది చివరిలో విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు సీజన్ 3 (Squid Game 3) రిలీజ్ కు రంగం సిద్దం చేసింది.
‘స్క్విడ్ గేమ్ సీజన్ 2’ మొదటి వారంలోనే 68 మిలియన్ల వ్యూస్ సంపాదించింది. ఏకంగా 92 దేశాల్లో నెట్‌ఫ్లిక్స్ ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానంలో నిలిచింది. భాషతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఈ వెబ్ సిరీస్‌ను ఆసక్తిగా వీక్షిస్తున్నారు.
తాజాగా సీజన్ 3 విడుదలపై హింట్ ఇస్తూ వచ్చిన ఓటీటీ సంస్థ ‘నెట్‌ఫ్లిక్స్’ తాజాగా స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసింది. జూన్ 27 నుంచి కొత్త సీజన్ స్ట్రీమింగ్ కానున్నట్లు ఆ ఓటీటీ తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.
రెండో సీజన్ తీసుకురావడంతో కొంత సమయం పట్టింది. కానీ.. మూడో సీజన్ మాత్రం త్వరగా వస్తుండటంతో అభిమానులు ఆనందంగా చూస్తున్నారు. ఫైనల్ గేమ్ కోసం సిద్ధంగా ఉండండి అంటూ ఓ పోస్టర్ ను కూడా పోస్ట్ చేసింది.