
మాడ్రిడ్ ఔట్‌స్కర్ట్స్‌లోని ఓ భారీ స్టూడియోలో, టెలివిజన్ ఇండస్ట్రీ స్టార్‌లతో కిక్కిరిసిన వాతావరణంలో నెట్‌ఫ్లిక్స్ మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేయడానికి సిద్ధమైంది. తన గ్లోబల్ హిట్ “మనీ హైస్ట్” కి వారసుడి కోసం కొత్త ప్రయోగం చేస్తోంది.
ఈ శుక్రవారం విడుదల కానున్న “బిలియనర్స్ బంకర్” , ఓ విశాలమైన అండర్‌గ్రౌండ్ కోటలో సెట్ అయిన డిస్టోపియన్ సిరీస్. ఇందులో జిమ్‌లు, గార్డెన్లు, లగ్జరీ రెస్టారెంట్‌తో కూడిన హైటెక్ సెటప్ కనిపించనుంది. ఇది నెట్‌ఫ్లిక్స్‌కి మరో స్పానిష్ సూపర్ ప్రొడక్షన్ .
“మనీ హైస్ట్ మా ఇండస్ట్రీకి టర్నింగ్ పాయింట్”
“మనీ హైస్ట్” స్పెయిన్ నేషనల్ మింట్‌ను టార్గెట్ చేసిన తెలివైన దొంగల గాథ. 2017లో విడుదలై, నెట్‌ఫ్లిక్స్ తొలి నాన్-ఇంగ్లీష్ గ్లోబల్ హిట్‌గా నిలిచింది.
ఇప్పుడు “బిలియనర్స్ బంకర్” ఆ మ్యాజిక్‌ని పునరావృతం చేయగలదనే నమ్మకం ఉంది.
సిరీస్ విజువల్ ఆర్టిస్టిక్ డైరెక్టర్ మిగ్వే ఆమోయెడో చెప్పిన మాటల్లోనే క్లూ ఉంది: “మనీ హైస్ట్ మాకు రెసిపీ ఇచ్చింది… ఇప్పుడు మళ్లీ ఆ విజయాన్ని రిపీట్ చేయగలం”
స్పెయిన్: నెట్‌ఫ్లిక్స్ కొత్త పవర్‌హౌస్
2017 నుంచి ఇప్పటివరకు దాదాపు 1,000 సినిమాలు, సిరీస్‌లు స్పెయిన్‌లో షూట్ అయ్యాయి. 2024లోనే స్పానిష్ టైటిల్స్ 5 బిలియన్ అవర్స్ వ్యూయింగ్ సాధించాయి.
స్క్రీన్‌రైటర్స్ అలెక్స్ పినా, ఎస్తేర్ మార్టినెజ్ “మనీ హైస్ట్”, “బెర్లిన్”, “స్కై రోజో”తో స్పానిష్ స్టోరీలను గ్లోబల్ స్టార్డమ్‌కి తీసుకెళ్లారు.
పినా చెప్పిన ఆసక్తికరమైన మాట:
“లోకల్ స్టోరీకి ఉన్న ఎగ్జాటిక్ టచ్ కూడా యూనివర్సల్ అవుతుంది. నెట్‌ఫ్లిక్స్ మాకు ఏ మార్పు చెప్పలేదు”
€1 బిలియన్ ఇన్వెస్ట్‌మెంట్ – టెక్నాలజీతో కొత్త లెవెల్
2015లో స్పానిష్ మార్కెట్‌లోకి ఎంటర్ అయిన నెట్‌ఫ్లిక్స్, 2019లో మాడ్రిడ్ నార్త్‌లో తన మొదటి యూరోపియన్ స్టూడియోను ప్రారంభించింది. ఇప్పుడీ ట్రెస్ కాంటోస్ స్టూడియో లో ఫిజికల్ డెకర్, డిజిటల్ ప్లాటోస్ కలిపి భవిష్యత్ సినిమా టెక్నాలజీని టెస్ట్ చేస్తున్నారు. 30 మీటర్ల పొడవైన, 6 మీటర్ల ఎత్తైన జెయింట్ ప్లాటో – మేఘాల సముద్రం, స్కైస్క్రేపర్ల ప్యానోరమా, గ్రామీణ రోడ్లను కూడా రియల్ లుక్‌లో చూపిస్తుంది.
“80% బిలియనర్స్ బంకర్ ఇండోర్స్‌లోనే షూట్ చేశాం” అని ఆమోయెడో చెప్పాడు. “ఇక్కడే US స్థాయిలో టెక్నాలజీని టెస్ట్ చేస్తున్నాం” అని హెడ్ ఆఫ్ ప్రొడక్షన్ విక్టర్ మార్టీ వివరించారు.
నెక్ట్స్ “మనీ హైస్ట్” సిద్ధమైందా?
స్పానిష్ క్రియేటివ్ టీమ్, బిలియన్ యూరోల ఇన్వెస్ట్‌మెంట్, అత్యాధునిక టెక్నాలజీ, గ్లోబల్ ఆడియన్స్ కోసం లోకల్ స్టోరీ – ఇవన్నీ కలిస్తే నెట్‌ఫ్లిక్స్ మరో హిస్టరీ క్రియేట్ చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ టాక్.
ఈ శుక్రవారం “బిలియనర్స్ బంకర్” సీక్రెట్ మొదలు కానుంది – ఇది నిజంగానే మనీ హైస్ట్ వారసుడు కథేనా?
