97వ అకాడమీ అవార్డుల కోసం 24 విభాగాలకు నామినేషన్లు ప్రకటించబడిన సంగతి తెలిసిందే. ఇందులో ‘విక్డ్’, ‘ఎమిలియా పెరెజ్’ చిత్రాలు చాలా కేటగిరీల్లో నామినేషన్లు అందుకున్నాయి. ఆస్కార్ అవార్డులు-2025లో భారతీయ సినిమాకు ప్రాతినిధ్యం దక్కింది. ప్రియాంకా చోప్రా నిర్మించిన అనూజ
సినిమాకు బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో చోటు లభించింది. ఈ విభాగంలో పరిశీలన కోసం ఏకంగా 180 సినిమాలు రాగా, వాటిల్లో ఐదింటిని నామినేట్ చేశారు.
దర్శకుడు ఆడమ్ జె గ్రేవ్స్ హిందీలో రూపొందించిన అమెరికన్ చిత్రం ‘అనుజ’ ఆస్కార్ 2025కి నామినేట్ చేయబడింది. ఈ చిత్రం లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో నామినేషన్ పొందింది. ఈ చిత్రానికి గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.
దర్శకురాలు సంధ్యా సూరి తెరకెక్కించిన ‘సంతోష్’, దర్శకురాలు పాయల్ కపాడియా తెరకెక్కించిన ‘ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్’ అనే రెండు భారతీయ చిత్రాలు ఆస్కార్స్ 2025లో అంతర్జాతీయ చలనచిత్ర విభాగానికి నామినేట్ అవుతాయని అంతా భావించారు. కానీ ఈ రెండు చిత్రాలు నామినేషన్‌ను పొందలేకపోయాయి. చివరికి ‘అనుజ’ అనే షార్ట్ ఫిల్మ్.. ఆస్కార్ 2025కి లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో నామినేషన్ పొందింది.
అక్టోబర్ 2024లో నిర్మాత గునీత్ మోంగా ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా కలిగి ఉన్నారు. దీని తరువాత నటి మిండీ కెల్లింగ్ నవంబర్ 2024లో, ప్రియాంక చోప్రా జనవరి 2025లో ఈ చిత్రంలో చేరారు.
బాల కార్మికుల జీవితాల్లోని చీకటి కోణాన్ని ఈ అనూజ
చిత్రంలో ఆవిష్కరించారు. బట్టల ఫ్యాక్టరీలో పని చేసే అనూజ అనే 9 ఏళ్ల పాప, ఆమె అక్క పాలక్ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది.
గ్రేవ్స్ రూపొందించిన ‘అనుజ’ లైవ్-యాక్షన్ షార్ట్ ఫిల్మ్ స్టోరీ అందరినీ ఆకట్టుకుంది. దీని కథ అనూజ అనే 9 ఏళ్ల బాలిక, ఆమె అక్క పాలక్‌తో కలిసి బట్టల ఫ్యాక్టరీలో పని చేస్తుంది. 9 ఏళ్ల అనూజ జర్నీ ఎలా ఉంటుందో అనేదే సినిమా స్టోరీ. ఆమె తన జీవితంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాలి అనుకున్నప్పుడు, అది ఆమె భవిష్యత్తుతో పాటు ఆమె కుటుంబంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది చూపించారు.
అవార్డులు
‘అనుజ’ చిత్రం ప్రపంచ ప్రీమియర్ 8 జూన్ 2024న 24వ డెడ్‌సెంటర్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జరిగింది. ఈ చిత్రం ఆగస్టు 2024లో జరిగిన హోలీషార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ అవార్డును గెలుచుకుంది.
అక్టోబర్ 2024లో ఇది మాంట్‌క్లైర్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో షార్ట్ ఫిల్మ్ కోసం ఆడియన్స్ అవార్డును గెలుచుకుంది. అలాగే అక్టోబర్ 2024లో జరిగిన న్యూయార్క్ షార్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గ్రాండ్ ప్రైజ్‌ని కూడా గెలుచుకుంది. దీని డిస్ట్రిబ్యూషన్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ చేజిక్కించుకుంది.
మార్చి 3న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఆస్కార్ 2025 వేడుకను ప్రత్యక్షంగా చూడవచ్చు.