పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీర మల్లూలో కనిపించిన నిధి అగర్వాల్‌కి, తాజాగా సోషల్ మీడియాలో ఊహించని వివాదం చుట్టుకొచ్చింది. భీమవరం లో జరిగిన ఓ స్టోర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న నిధి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన వాహనంలో ప్రయాణించడం గమనించిన నెటిజన్లు ప్రశ్నలు వర్షం కురిపించారు – “ఒక హీరోయిన్ కి ప్రభుత్వ కారు ఎందుకు?” అని.

ఈ గోలపై నిధి స్వయంగా సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చింది. తన ఎక్స్ (X) అకౌంట్‌లో ఆమె ఇలా రాసింది –

“నా భీమవరం ట్రిప్ గురించి సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని అపోహలను నివృత్తి చేయాలనుకుంటున్నాను. ఈవెంట్ సమయంలో లోకల్ ఆర్గనైజర్స్ నాకు ట్రాన్స్‌పోర్ట్ అందించారు. అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన వాహనం కావడం యాదృచ్ఛికం. నేను ఆ వాహనాన్ని అడగలేదు, లేదా కోరుకోలేదు. ఇది పూర్తిగా ఈవెంట్ నిర్వాహకుల నిర్ణయం.”

తనపై వస్తున్న ఆరోపణలు వాస్తవం కాదని ఆమె స్పష్టం చేసింది –

“ప్రభుత్వ అధికారులు నన్ను పంపించారని చెప్పడం పూర్తిగా నిరాధారం. నాకు ఈ సందర్భంలో ఎలాంటి సంబంధం లేదు. ఈ వాహనం వాడటం ప్రభుత్వ అధికారులతో సంబంధం లేకుండా జరిగింది.”

నిధి చివరగా,

“నా అభిమానుల మద్దతు నాకు చాలా విలువైనది. అసత్య సమాచారం వ్యాప్తి చెందకూడదనే ఉద్దేశంతోనే ఈ వివరణ ఇస్తున్నాను”
అని ముగించింది.

ప్రస్తుతం నిధి, ప్రభాస్ హీరోగా వస్తున్న ది రాజా సాబ్ సినిమాలో నటిస్తోంది. హరి హర వీర మల్లూలో ఆమె పంచమి (దేవదాసి) పాత్రలో కనిపించగా, పవన్ కళ్యాణ్ వీర మల్లూ అనే దొంగ పాత్రలో మెప్పించారు.

, , ,
You may also like
Latest Posts from