గత సంవత్సరం మెగా డాటర్ నిహారిక హీరోయిన్ గా విడుదలైన తమిళ్ ఫిల్మ్ ‘మద్రాస్‌కారన్‌’ తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేసింది. ఇప్పటి వరకు తమిళంలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం.. ఇప్పుడు తెలుగులో కూడా అందుబాటులోకి వచ్చింది. ఈరోజు నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ‘ఆహా’ లో తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ‘ఆహా’ పోస్టర్ రిలీజ్ చేసింది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ‘ఆహా’లో (Aha) ప్రస్తుతం తమిళ వెర్షన్ స్ట్రీమింగ్ అవుతుండగా.. ఇప్పుడు తెలుగులోనూ నేరుగా రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది.

ఫిబ్రవరి 26 నుంచి తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ కానున్నట్లు ‘ఆహా’ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్ రిలీజ్ చేసింది.

‘అపరిచితుల మధ్య ఓ చిన్న వాదన జీవితాన్ని మార్చే సంఘర్షణకు దారి తీస్తుంది.’ అంటూ పేర్కొంది. ఈ మూవీలో కలైయరసన్, ఐశ్వర్యదత్తా కీలక పాత్రలు పోషించారు.

, ,
You may also like
Latest Posts from