హీరో నితిన్ (Nithiin) కు బ్యాడ్ టైమ్ ఇంకా పోలేదు. అతని తాజా చిత్రం ‘రాబిన్ హుడ్’ (Robinhood) సైతం డిజాస్టర్ అయ్యింది. నిజానికి ఈ సినిమాపై నితిన్ ఆశలు పెట్టుకున్నాడు. నితిన్ నాన్ స్టాప్ గా పబ్లిసిటీ చేశాడు. అలాగే నిర్మాతలు కూడా ఖర్చుకు వెనకాడకుండా క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner) ను స్పెషల్ గెస్ట్ గా రంగంలోకి దించారు.
నితిన్, శ్రీలీల (Sreeleela), డేవిడ్ వార్నర్ ను సినిమా రిలీజ్ కు ముందు మాగ్జిమమ్ వాడేసుకున్నారు. అయినా కలిసి రాలేదు. దాంతో ఇప్పుడు నితిన్ తన ఆశలన్నీ త్వరలో రాబోతున్న ‘తమ్ముడు’ మూవీపై పెట్టుకున్నాడు.
దిల్ రాజు బ్యానర్ లో రూపొందుతోంది ‘తమ్ముడు’ మూవీ. నానితో ‘ఎంసీఎ’, పవన్ కళ్యాణ్ తో ‘వకీల్ సాబ్’ మూవీస్ చేసిన శ్రీరామ్ వేణు దీనికి దర్శకుడు. అజనీశ్ లోక్ నాథ్ సంగీత దర్శకుడు.
అలాగే ఈ సినిమా విడుదల కాకముందే నితిన్.. దిల్ రాజు బ్యానర్ లో మరో సినిమా ‘ఎల్లమ్మ’ చేయడానికీ రెడీ అయ్యాడు. ఒకే బ్యానర్ లో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నాడు కాబట్టి… ‘తమ్ముడు’ను ఎలాగైనా దిల్ రాజు సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తాడనే నమ్మకంతో నితిన్ ఉన్నాడు.