ఈ ఆగస్టు 9న సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టినరోజు. ఆయన అభిమానులు ఈ సారి బర్త్‌డేను ఎంతో ప్రత్యేకంగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే రాజమౌళితో మహేశ్ చేస్తున్న భారీ ప్రాజెక్ట్‌ (SSMB29) నుండి ఎట్టకేలకు ఏదైనా అప్‌డేట్ వస్తుందన్న అంచనాలో అందరూ ఉన్నారు. గతేడాది పక్కా ప్రచారంలేకుండా షూటింగ్ ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్‌ గురించి ఇప్పటి వరకు ఒక్క అధికారిక సమాచారం కూడా బయటకు రాలేదు.

ఇంతవరకు కనీసం ఒక కాన్సెప్ట్ పోస్టర్ కానీ, చిన్న టీజర్ అయినా వస్తుందనుకుని ఎదురు చూసిన అభిమానులకు ఓ నిరాశాజనకమైన వార్త బయటకు వచ్చింది. టాక్ ఏంటంటే… రాజమౌళి బర్త్‌డే స్పెషల్ కోసం ఏ అప్‌డేట్ ఇవ్వకూడదని డెసైడ్ అయ్యారని, ఇది అంత చిన్న ప్రాజెక్ట్ కాదు – గ్లోబల్ లెవల్లో ప్లాన్ చేస్తున్నామని చెప్పారట.

అందుకే, ఆగస్టు 9న ఎటువంటి ప్రమోషనల్ మెటీరియల్ విడుదలయ్యే అవకాశమే లేదు. ఈ వార్త విని అభిమానులు బాధపడుతున్నారు.

ఇకపోతే, ప్రస్తుతం రాజమౌళి టీమ్‌ ఆఫ్రికన్ దేశాల్లో భారీ షెడ్యూల్ కోసం రిక్కీ, లొకేషన్ వర్క్‌లతో బిజీగా ఉంది. ఏది చేసినా గ్రాండ్‌గా చేయాలనే రాజమౌళి స్టైల్ ఈసారి కూడా మిస్ కాకపోతే చాలు అంటున్నారు ఫ్యాన్స్.

ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే ‘ఇండియానా జోన్స్‌’ స్టైల్‌ కథతో ఈ సినిమా రూపొందుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే… ఈ కథలో విలన్‌ ఎవరు? అనే విషయం సినిమా ముగిసేవరకూ ఊహించలేమట. పతాక సన్నివేశాల వరకు నెగెటివ్‌ రోల్‌ తెలియనివ్వకుండా ప్రేక్షకులను సస్పెన్స్‌ చేయనున్నారట రాజమౌళి. ఈ చిత్రంలో మాధవన్‌ కీలకపాత్రలో కనిపించనున్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. దాంతో ఆయన విలన్‌గా కనిపించనున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి.

, ,
You may also like
Latest Posts from