సినిమా వార్తలు

రాజ్ తరుణ్ క్రేజ్‌కు ఎండ్ కార్డా?ఈ దారుణం ఏంటి రాజా!

ఒకప్పుడు యూత్ ఫేవరెట్ హీరో… వరుసగా హిట్స్ కొట్టి ఇండస్ట్రీలో “ప్రామిసింగ్ యాక్టర్”గా నిలిచిన రాజ్ తరుణ్. ఉయ్యాల జంపాల, కుమారి 21F, ఆడో రకం ఈడో రకం వంటి బ్యాక్–టు–బ్యాక్ సక్సెస్‌లు ఇచ్చి అప్పుడు బాక్సాఫీస్‌లో మంచి క్రేజ్ సంపాదించాడు. కానీ… ఆ జోరు ఎక్కువ కాలం నిలబడలేదు.

తర్వాత వచ్చేశాయి వరస డిజాస్టర్స్, వరస డ్రాప్‌లు, వరస డిసప్పాయింట్‌మెంట్స్. దీంతో రాజ్ తరుణ్ మార్కెట్ కళ్లెదుటే కరిగిపోయింది. తాజాగా వచ్చే సినిమాలకు మాత్రం పబ్లిక్ నుండి ఎలాంటి నోటీసు కూడా లేదు అన్న స్థితి.

‘పాంచ్ మినార్’ కూడా కాపాడలేకపోయింది!

గత శుక్రవారం విడుదలైన రాజ్ తరుణ్ తాజా చిత్రం Paanch Minar. రివ్యూలు మాత్రం—ఆయన గత సినిమాలతో పోలిస్తే—కొంచెం బెటర్ అని చెప్పాలి. అయినా థియేటర్ల వద్ద ఆడియన్స్ స్పందనే లేదు. మంచి టాక్ వచ్చినా ఫుట్‌ఫాల్స్ రాలేదు అంటే… అవును, ఇది నిజంగా రాజ్ తరుణ్ కెరీర్‌కు రెడ్ సిగ్నల్ అనే చెప్పాలి.

Biggest Twist: రిలీజ్ అయ్యి వారం కూడా కాకముందే OTTలో!

సినిమా కలెక్షన్లు పడిపోవడంతో, రిలీజ్ అయ్యి కేవలం 7 రోజుల్లోనే Paanch Minar అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కి వచ్చేసింది. సాధారణంగా థియేటర్లలో మంచి రన్ ఉన్న సినిమాలు కనీసం 4–5 వారాలు తర్వాతే OTTలకు వస్తాయి. కానీ ఇది వారం లోపలే రావడం… మార్కెట్ స్థితి ఏ స్థాయికి చేరిందో అర్థమవుతుంది.

ఇండస్ట్రీ టాక్ ఏంటి?

పబ్లిక్‌లో క్రేజ్ పూర్తిగా తగ్గింది. ప్రమోషన్స్ కుడా పెద్దగా రీచ్ అవడం లేదు. వరస ఫ్లాప్స్ కారణంగా సినిమా బయ్యర్లు కూడా రిస్క్ తీసుకోవడంలేదు. సింపుల్‌గా చెప్పాలంటే — “రాజ్ తరుణ్ మార్కెట్ డేంజర్ జోన్‌లోకి వెళ్లిపోయింది.”

Similar Posts