చిన్న సినిమాలకు రివ్యూలు ఎంత హెల్ప్ అవుతాయో మనందరికీ తెలుసు బ్రో. రేటింగ్స్ బాగా వస్తే అవే పోస్టర్స్ మీద, సోషల్ మీడియాలో ప్రింట్ చేసి మరీ జనాల్ని థియేటర్స్‌కి లాగేస్తారు. “పరదా” యూనిట్ కూడా అదే ఎక్సపెక్ట్ చేసింది.

“ఇది మహిళలు ఎదుర్కొనే రియల్ సమస్యల మీద స్టోరీ… కాబట్టి క్రిటిక్స్ తప్పక అండగా నిలుస్తారు” అని ఫుల్ బిలీవ్ పెట్టుకున్నారు. అందుకే “రివ్యూస్ చూసి థియేటర్స్‌కి వెళ్ళండి” అనే స్లోగన్ కూడా హైలైట్ చేశారు.

కానీ గేమ్ మొత్తం రివర్స్ అయింది బ్రో. ఎక్స్‌పెక్ట్ చేసిన రివ్యూస్ రాకపోవడమే కాకుండా, క్రిటిక్స్ గట్టిగానే ఫైర్ చేశారు. “కథ ఆసక్తికరంగా లేదు… డైరెక్షన్‌లో లోపాలు ఉన్నాయి” అంటూ లైన్ బై లైన్‌గా తప్పులు కౌంట్ చేశారు.

ఈ షాక్‌తో యూనిట్ వెంటనే కొత్త నినాదం క్రియేట్ చేసింది:

“మంచి సినిమాని ప్రేమించే ఆడియన్స్ తప్పకుండా థియేటర్స్‌కి వెళ్లండి. ఈ రివ్యూలు ఎందుకు వచ్చాయో మీరు చూసాకే షాక్ అవుతారు!”**

డైరెక్టర్ ప్రవీణ్ మాత్రం బహిరంగంగానే అంగీకరించాడు: “అవును, తప్పులు ఉన్నాయి… రివ్యూ రైటర్స్ వాటిని రాశారు. నేను కూడా మనిషినే కదా, తప్పులు చేస్తాను” అని కాస్త ఎమోషనల్‌గా కానీ బ్యాలెన్స్‌గా మాట్లాడేశాడు.

అసలు ఫైర్ అయ్యింది అనుపమ . “మీరెందుకు తప్పు చేశానని ఒప్పుకుంటున్నారు? ఇది మీ ఫాల్ట్ కాదు… కొంతమందికి ఇలాంటి సినిమాలు నచ్చవు, అంతే. కమర్షియల్ మాస్ మూవీస్‌లో వెయ్యి తప్పులు ఉన్నా వాళ్లు లైట్ తీసుకుంటారు. కానీ ఫిమేల్ సినిమాలకి మాత్రం ఇంత కఠినంగా జడ్జ్ చేస్తారా?” అంటూ రివ్యూ రైటర్స్ మీద కాస్త స్ట్రాంగ్‌గా రగిలిపోయింది.

ఆమె మాటల్లో ఆవేశం స్పష్టంగా కనిపించింది బ్రో. చివర్లో “ఇది వైన్‌లా ఉండే సినిమా… స్లో పాయిజన్ లా మెల్ల మెల్లగా పబ్లిక్‌కి ఎక్కుతుంది” అంటూ తన ఆశను వ్యక్తం చేసింది.

కానీ రియాలిటీ ఏమిటంటే, నేటి జెనరేషన్‌లో ఫస్ట్ డే ఫస్ట్ షో టాక్ తోనే డెస్టినీ సీలైపోతుంది. నెగటివ్ టాక్ వచ్చినా తర్వాత పుంజుకోవడం అంటే మిరాకిల్ లెవెల్. వార్ 2, కూలీ లాంటి పెద్ద సినిమాలు కూడా రికవర్ కాలేకపోయినప్పుడు… “స్లో పాయిజన్ హిట్” అనేది కాస్త హార్డ్‌గానే అనిపిస్తోంది.

, , ,
You may also like
Latest Posts from