సినిమా వార్తలు

ఇండస్ట్రీని షేక్ చేసిన పవన్ – పీపుల్స్ మీడియా సీక్రెట్ డీల్!

టాలీవుడ్‌లో పవన్ కళ్యాణ్ పేరు వింటే… మాస్, కల్ట్, ప్యాషన్! ఇప్పుడు అదే పేరుకు మరో కొత్త ఛాప్టర్ జోడుకాబోతోంది. డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్న పవన్, వెనక నుంచి ఒక భారీ ఫిల్మ్ ప్లాన్ నడిపిస్తున్నాడన్న టాక్ ఇండస్ట్రీలో వైడ్‌గా స్ప్రెడ్ అవుతోంది. హీరోగా మాత్రమే కాదు—క్రియేటివ్ బాస్‌గా కూడా!

పవన్–PMF కాంబో… కలిసింది గొల్డ్‌గా!

బ్రో సినిమా నుంచి పవన్ కళ్యాణ్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (టీజీ విశ్వప్రసాద్) బంధం చాలా స్ట్రాంగ్ అయ్యింది. అక్కడి నుంచి ఇప్పుడొచ్చేసింది ఒక మెగా డీల్.

వెలుగులోకి వస్తున్న వివరాల ప్రకారం…

భవిష్యత్తులో పలు భారీ సినిమాలు…వాటిలో రెండు సినిమాలు పవన్ హీరోగా…. కానీ అసలు హైలైట్? హీరోగా చేసే సినిమాలు మాత్రమే కాదు… ఇతర సినిమాలకు కూడా పవర్ స్టార్ క్రియేటివ్ డైరెక్షన్!

అంటే…

కథల సెలక్షన్, కంటెంట్ క్వాలిటీ, ప్రమోషన్ ఐడియాస్, బ్రాండ్ పవన్ ఇమేజ్ యాడ్ అవటం అన్నీ PKCW (Pawan Kalyan Creative Works) ఇన్వాల్వ్ అవుతాయి!

ఇది స్టార్ పవర్ కాదు… మార్కెట్ స్ట్రాటజీ.

ఇది సినిమా కాదు… ఇండస్ట్రీ మూవ్

టాక్ ఏంటంటే… పవన్ తన ఫ్యాన్స్, మార్కెట్, మాస్ క్రేజ్‌ను స్మార్ట్‌గా కమర్షియల్ పవర్‌గా మార్చాలనుకుంటున్నాడు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి: అంతర్జాతీయ రిలీజ్ సిస్టమ్ , భారీ నిర్మాణ విలువలు. బలమైన ఫైనాన్సింగ్

పవన్ కళ్యాణ్‌కు: ఫాలోయింగ్, మైండ్‌సెట్టింగ్, క్రేజ్ ఈ కాంబినేషన్ ఒక్కో ప్రాజెక్ట్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లగలదు.

పవర్ స్టార్ రాజకీయాల్లోనే కాదు… సినిమాల్లో కూడా పవర్ఫుల్ ప్లాన్!

హరి హర వీర మల్లు రిలీజింగ్ టైమ్ లో పీపుల్ మీడియా యాక్టివ్ సపోర్ట్ ఇచ్చిన తర్వాత ఈ భాగస్వామ్యం కాంక్రీట్ అయ్యిందని గాసిప్.

ఇప్పుడు క్లియర్:

డిప్యూటీ సీఎంగా బిజీ
సినిమాలకు టైమ్ తగ్గింది
కాని పవన్ ప్లాన్ మారలేదు

నటన మాత్రమే కాదు, నడిపించే శక్తి! భవిష్యత్తులో ఈ బ్యానర్స్ నుంచి వచ్చే సినిమాలు:

స్కేలు భారీ
లుక్ ఇంటర్నేషనల్
కథలు కమర్షియల్ + విజువల్

ఏదైమైనా “పవన్ కొత్తగా గేమ్ మొదలుపెట్టారు… గెలవడానికి కాదు, రూల్ చేయడానికి.”

Similar Posts