పవన్ కళ్యాణ్‌ లేటెస్ట్ రిలీజ్ ‘హరి హర వీర మల్లు: పార్ట్ 1 – స్వోర్డ్ vs స్పిరిట్’ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలింది. భారీ బడ్జెట్, మైథలాజికల్ బేస్ ఉన్న ఈ సినిమా, విడుదలకు ముందే చాలా హైప్ తెచ్చుకున్నా… రిలీజ్ అయ్యాక మాత్రం తీవ్ర నిరాశే మిగిలింది. స్టార్ట్ మాత్రం పవన్ మార్క్ ఓపెనింగ్స్‌తో దుమ్ము రేపింది. కానీ కంటెంట్ వర్క్ అవుట్ కాకపోవడం, రాజకీయ కమిట్‌మెంట్స్ వల్ల పవన్ ప్రమోషన్ చేయలేకపోవడంతో… వసూళ్లు డ్రాప్ అయ్యాయి.

అయితే ఈ ఫలితంతో పవన్ స్టార్డమ్ తగ్గిపోయిందా? అస్సలు కాదు! స్టార్ పవర్ ఏంటో ‘ఓపెనింగ్స్‌’తో మరోసారి రుజువైంది. కానీ ఇప్పుడు పరిస్థితి మరింత కీలకం. పవన్ కళ్యాణ్ సినిమాలకు క్రేజ్‌ ఉన్నా… హిట్ పడితేనే మళ్లీ మాస్‌లో మంటలు చిమ్మడం సాధ్యం. ఇప్పుడు అదే టైమ్.

OG, ఉస్తాద్ భగత్ సింగ్‌: ఫ్యాన్ డైరెక్టర్లు – ఫ్యాన్స్ ఆశలు

ఇప్పుడు పవన్ చేతిలో ఉన్న రెండు ప్రాజెక్టులు – OG (Sujeeth డైరెక్షన్‌లో) & ఉస్తాద్ భగత్ సింగ్ (Harish Shankar డైరెక్షన్‌లో). ఇద్దరూ పవన్ హార్డ్‌కోర్ ఫ్యాన్స్. ఇదే వాళ్లకూ ఛాన్స్… తమ అభిమాన హీరోకు బాక్సాఫీస్‌ బ్లాక్‌బస్టర్ ఇవ్వడానికి. పవన్ కెరీర్‌లో చివరి సినిమాలు కావొచ్చన్న బజ్ మధ్య ఈ రెండు సినిమాలపై భారీ హైప్ ఉంది.

ఫ్యాన్స్‌తో పాటు మాస్ ఆడియెన్స్ కూడా ఎదురు చూస్తున్న పాన్ ఇండియా రీ-ఎంట్రీ ఇది. OG ఒక స్టైలిష్ యాక్షన్ డ్రామాగా, ఉస్తాద్ భగత్ సింగ్ పక్కా మాస్ ఎంటర్టైనర్‌గా వస్తున్నాయి. ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యితే… పవన్ స్టార్డమ్ ఏ స్థాయిలో ఉందో మళ్లీ దేశం మొత్తం గ్రహిస్తుంది.

ఫ్యాన్‌బాయ్స్ చేతుల్లో పవర్ స్టార్ ఫేట్!

ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ స్టార్‌డమ్‌ వన్ మ్యాన్ షో కాదు. ఇది సుజీత్, హరీష్ శంకర్ చేతుల్లో. వాళ్ల డైరెక్షన్ పవన్ పవర్‌కు న్యాయం చేస్తే, టాలీవుడ్‌లో మళ్లీ పవన్ ఓ రెడీ స్టార్డం నిలవడం ఖాయం.

పవన్ పాలిటిక్స్‌లో బిజీ అయినా… ఈ రెండు సినిమాలు వర్కౌట్ అయితే, ఫ్యాన్స్‌కు ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది. స్టార్డమ్ ఉంటే సరిపోదు – దాన్ని నిలబెట్టే కంటెంట్, డైరెక్షన్ అవసరం. ఇప్పుడు ఈ పని పవన్ ఫ్యాన్ డైరెక్టర్ల చేతుల్లోనే ఉంది.

మొత్తానికి, పవన్ కళ్యాణ్ కెరీర్‌కి ఇది మేక్ ఆర్ బ్రేక్ మోమెంట్. ఫ్యాన్స్‌ చేతుల్లో ఉన్న ఈ responsibility – భారీ హిట్‌తో రిపే చేయగలరా? లేదా అనే Suspense‌కు జవాబు చెబుతాయి OG, ఉస్తాద్ భగత్ సింగ్.

, , , , , ,
You may also like
Latest Posts from