ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ సినిమా హరిహర వీరమల్లు. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. అభిమానుల భారీ అంచనాల మధ్య జులై 24న విడుదలైన ఈ మూవీ డివైడ్ టాక్ సొంతం చేసుకుంది.
ఇక ‘హరి హర వీర మల్లు’ ఫస్ట్ వీక్ బాక్సాఫీస్ రన్ పూర్తయ్యింది. ఇది పవన్ కెరీర్‌లోనే అతిపెద్ద ఫెయిల్యూర్స్‌లో ఒకటిగా మిగిలిపోయింది.
వీకెండ్ నుంచే సినిమా వసూళ్లు డల్‌గా ఉండటం, వీక్డేస్‌లో పూర్తిగా కుదేలవడం స్పష్టమైంది. ట్రేడ్ లో విడుదలకు ముందు ఈ సినిమాకు దాదాపు ₹120 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఉండగా, ఫస్ట్ వీక్ లో షేర్ రూపంలో వసూలు చేసినది కేవలం ₹65 కోట్లు మాత్రమే. అంటే 54% రికవరీతో అక్కడికక్కడే స్టేజ్ క్లియరయ్యింది అని చెప్పొచ్చు.
🔻 ఏరియా వైజ్ షేర్ వివరాలు:
ప్రాంతం షేర్
నైజాం ₹18.2 కోట్లు
సీడెడ్ ₹7.5 కోట్లు
ఉత్తరాంధ్ర ₹7.5 కోట్లు
గుంటూరు ₹5.4 కోట్లు
ఈస్ట్ గోదావరి ₹5.2 కోట్లు
వెస్ట్ గోదావరి ₹4.3 కోట్లు
కృష్ణా ₹4.7 కోట్లు
నెల్లూరు ₹1.75 కోట్లు
ఏపీ+తెలంగాణ కలిపి – ₹54.55 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా (అందుబాటులో ఉన్న అంచనాల ప్రకారం) – ₹4.05 కోట్లు
ఓవర్సీస్ – ₹6.05 కోట్లు
మొత్తం వరల్డ్‌వైడ్ షేర్ – ₹64.65 కోట్లు
ట్రేడ్ అంచనాలు వర్సెస్ రియాలిటీ:
బ్రేక్ ఈవెన్ టార్గెట్: ₹120 Cr
సాధించిన షేర్: ₹65 Cr
రికవరీ: కేవలం 54%
ఫలితం: భారీ నష్టాలతో డిస్ట్రిబ్యూటర్లు డీలా, పవన్ కెరీర్‌లో ఇదొక ఊహించని నెగటివ్ మార్క్.