రెబల్ స్టార్ Prabhas ప్రస్తుతం వరుస పెట్టి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. రీసెంట్ గా సంక్రాంతికి మారుతి దర్శకత్వంలో వచ్చిన చిత్రం The Raja Saab. ఈ సినిమా డిజాస్టర్ అవటంతో ఎక్కడ తప్పు జరిగిందనే డిస్కషన్ మీడియాలో జరుగుతోంది. ఈక్రమంలో ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ Sandeep Reddy Vanga తో కలిసి ప్రభాస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మూడు సినిమాలతో సమానం.. కానీ!

షూటింగ్ ఎన్ని రోజులు చేశారు అని సందీప్ వంగా అడగ్గా.. ప్రభాస్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. “సుమారు 140 నుండి 150 రోజులు షూటింగ్ చేశాం. ఇది దాదాపు మూడు సినిమాలతో సమానం” అని ప్రభాస్ చెప్పుకొచ్చారు. సాధారణంగా ఒక సినిమాకు ఇంత సమయం అంటే ఎక్కువే అనిపిస్తుంది, కానీ ఈ సినిమా రేంజ్ అలాంటిదని ప్రభాస్ క్లారిటీ ఇచ్చారు.

సింపుల్ అన్నాడు.. కానీ మాన్స్టర్స్ వచ్చారు!

మొదట ఈ సినిమా గురించి మారుతి చెప్పినప్పుడు “డార్లింగ్ ఇది చాలా సింపుల్ సినిమా, త్వరగా పూర్తి చేసేద్దాం” అన్నాడట. కానీ షూటింగ్ మొదలయ్యే 6 నెలల ముందు కథలో చాలా మార్పులు వచ్చాయి.

Hypnotism Idea: కథలోకి హిప్నాటిజం అనే కొత్త కాన్సెప్ట్ వచ్చింది.

Monsters Entry: సినిమాలో మాన్స్టర్స్ (రాక్షసులు) కూడా వచ్చి చేరారు.

High-Octane Action: క్లైమాక్స్‌లో ఏకంగా 20 నిమిషాల భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుందని ప్రభాస్ వెల్లడించారు.

సింపుల్ అని మొదలుపెట్టిన సినిమా, చివరకు ఇంత పెద్ద Horror-Comedy Adventure గా ఎలా మారిందో ప్రభాస్ మాటల్లో వింటే ఆశ్చర్యం కలుగుతుంది. మారుతి మేకింగ్ స్టైల్, ప్రభాస్ మాస్ క్రేజ్ తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందనుకుంటే డిజాస్టర్ అయ్యింది! అందుకు ఈ కారణాలే ప్రధానం అంటున్నారు సోషల్ మీడియా జనం. మొదట మారుతి అనుకున్న కథనే చేసి ఉంటే వేరే విధంగా ఉండేదని అంటున్నారు.

#Horror-Comedy Adventure, #Maruthi, #Prabhas, #Sandeep Reddy Vanga, #The Raja Saab, #The Raja Saab Secrets

By admin