
ప్రదీప్ హ్యాట్రిక్ మిస్!మధ్యలో ఎవరు దెబ్బ కొట్టారు?
ఈ ఏడాది బాక్సాఫీస్‌ను ఊపేసిన యువ హీరో ప్రదీప్ రంగనాథ్ ని ఒక అరుదైన అవకాశం చేతుల మధ్య జారి పోయింది.
“డ్రాగన్” – సూపర్ హిట్.
“డ్యూడ్” – బ్లాక్‌బస్టర్.
ఇంకా ఒక సినిమా డిసెంబర్‌లో రిలీజ్ అయ్యుంటే… ఒకే క్యాలెండర్ ఇయర్‌లో మూడు వరుస హిట్స్ కొట్టేసేవాడు! కానీ ఆ హ్యాట్రిక్ మ్యాజిక్ ఒక్క అడుగు దూరంలోనే ఆగిపోయింది.
మొదలైన బజ్ – ‘లవ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ’ డిసెంబర్ రిలీజ్!
ప్రదీప్ మూడో సినిమా “Love Insurance Kompany (LIK)” డిసెంబర్ 18 రిలీజ్‌కే రెడీగా ఉంది. థియేటర్లలో భారీ క్రేజ్ ఉండేదని సోషల్ మీడియా ఊగిపోయింది. కానీ సడెన్‌గా పోస్టర్ డేట్ మార్చేసారు! ఇంట్రస్టింగ్‌గా… కారణం కథలోని ట్విస్ట్‌ల్లాగే ఉంది.
పోస్ట్-ప్రొడక్షన్ డిలే:
తమిళ మీడియా రిపోర్ట్ ప్రకారం, పోస్ట్-ప్రొడక్షన్ వర్క్ పూర్తికాలేదు. అందులో ముఖ్యంగా తెలుగు డబ్బింగ్ పూర్తి కాలేదు.
ప్రదీప్ మాత్రం స్ట్రిక్ట్:
“సినిమా తమిళంతో పాటు సిమల్టేనియస్‌గా తెలుగు రిలీజ్ కావాలి.” అందుకే వాయిదా.
మరో కారణం:
అనిరుధ్ మ్యూజిక్ స్కోర్ ఇంకా పూర్తి కాలేదు.
కొత్త ప్లాన్ – వాలెంటైన్స్ వీక్ టార్గెట్!
మేకర్స్ డిసెంబర్ ప్లాన్ వదిలేశారు. ఇప్పుడు కొత్త దిశగా చూస్తున్నారు: ఫిబ్రవరి 12 లేదా 13 – వాలెంటైన్స్ వీక్ రిలీజ్! ఈ జాన్రాకి ఇది పర్ఫెక్ట్ టైమింగ్. ప్రొమోషన్స్‌కి కూడా టైమ్ దొరుకుతుంది. అంతేకాక… అవతార్ 3 డిసెంబర్ 19న రానుండటంతో, ఒక పెద్ద క్లాష్ తప్పించుకున్నారు.
మిస్ అయిన రికార్డ్, కానీ తెలివైన మూవ్
అవును, ప్రదీప్ మూడు హిట్స్ ఒకే ఏడాదిలో కొట్టే అవకాశం మిస్ అయ్యాడు. కానీ కలెక్ట్ వైజ్ చూసుకుంటే – సేఫ్, స్మార్ట్ డెసిషన్. వాలెంటైన్స్ వీక్‌లో రిలీజ్ అయితే…
రొమాంటిక్ డ్రామాకి బాక్సాఫీస్‌లో బలమైన చాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈసారి Gen Z + Couples + Pradeep Craze అండ్ అనిరుధ్ మ్యూజిక్ – మిక్స్ పేలుడు మాదిరిగా ఉంది.
ఆఫిషియల్ రిలీజ్ డేట్ త్వరలోనే!
