మనకు హారర్ కామెడీలు కొత్తేమీ కాదు. స్టార్ హీరో ఉండక్కర్లేదు, బడ్జెట్ ఎక్కువ ఉండక్కర్లేదు… జస్ట్ టైమ్ పాస్ అయ్యేలా ఫన్, జంప్‌స్కేర్స్ ఇస్తే చాలు, ఆడియెన్స్ సంతృప్తి. అందుకే చాలా మంది మేకర్స్ ఈ జానర్ వైపు ఈజీగా వచ్చేస్తారు. ఇప్పుడు అదే ట్రాక్‌లో కానీ కాస్త కొత్త మసాలా వేసి వచ్చిందీ — హంగర్ కామెడీ! అవును, హంగర్ + కామెడీ = ఈ కొత్త ఫార్ములా. కమెడియన్ ప్రవీణ్, ఎప్పటిలాగే తన టైమింగ్‌తో ఎంటర్టైన్ చేసే ఆయన, ఈసారి బకాసుర రెస్టారెంట్ టైటిల్‌తో హీరోగా వచ్చారు. టైటిల్ విన్నప్పుడే “అబ్బా, ఇదేం క్రేజీ ఐడియా రా!” అనిపించింది. ప్రమోషనల్ వీడియోలు బయటకు రాగానే “ఇది హంగర్ కామెడీ” అని క్లియర్ చేశారు. దాంతో మన మైండ్‌లో అంచనాల పులావ్ రెడీ. మరి ఈ సినిమా ఆ పులావ్ రుచిగా వండిందా? లేక బియ్యం మగ్గకముందే ప్లేట్‌లో వడ్డించేసిందా? రివ్యూలోకి వెళ్లిచూద్దాం.
స్టోరీ లైన్
పరమేష్ (ప్రవీణ్) — ఓ సాధారణ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. లైఫ్‌కి ఒకటే కల..ఎప్పటికైనా బిర్యానీ రెస్టారెంట్ ఓపెన్ చేసి బాస్‌లా కూర్చోవాలి. కానీ బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే… “నీ కలలన్నీ కేవలం డ్రీమ్‌లే” అన్నట్టుంది. రెస్టారెంట్ ఓపెన్ చేయాలంటే…మినిమం 50 లక్షలు కావాలి. దాని కోసం యూట్యూబ్ ఛానల్ Bindass Bachelors స్టార్ట్ చేసి, హాంటెడ్ ప్లేసెస్‌లో వ్లాగ్స్ తీయడం మొదలెడతాడు.
ఒకసారి ఇలా ఊరి చివర ఇంట్లో షూటింగ్ చేస్తూంటే ఓ తంత్ర శాస్త్రం బుక్ దొరుకుతుంది. దానితో రిచ్ అవుదామనుకుని మంత్రాలు మొదలెట్టి అనుకోకుండా , బక్క సూరి (వివా హర్ష) అనే 200 ఏళ్ల క్రితం నాటి ఆకలితో ఉన్న ఆత్మను లేపేస్తారు. మిగతా సినిమా — ఆ ఆత్మ వాళ్ల లైఫ్‌లో ఏం చేస్తుంది? వాళ్ల కల నెరవేరుతుందా లేదా? అనేదే.
ఎలా ఉంది
స్టోరీ & న్యారేషన్: ఓపెనింగ్ ఓకే కానీ, ప్లాట్ డెప్త్ లేదు. ఆకలితో ఉన్న దెయ్యం అంటే ఫన్ లేదా ఫీల్ వచ్చేలా ఏం రాలేదు. అలాగే కుక్డ్ ఫుడ్‌ను ఫ్లోర్ మీద పడేసి, కర్రీలు, సాంబార్ కలిపి, ఎడమ చేత్తో తినడం వంటి సీన్స్ — స్క్రీన్ మీద చూస్తే భయంకన్నా వాంతులు ఎక్కువగా వచ్చేలా ఉన్నాయి. కామెడీని చాలా స్ట్రెచ్ చేసి రిపీట్ చేయడం వల్ల బోర్ ఫీలవుతాం. ఇది చాలదన్నట్లు క్లైమాక్స్‌లో ట్రాన్స్‌జెండర్ సీన్: అర్థం లేని, ఫోర్స్ చేసిన ట్రాక్. ఇక డైలాగులు: “గుండె జారి గువ్వలోకి వెళ్లింది”, “జి మూసుకుని” లాంటి లోబ్రో ఎక్స్‌ప్రెషన్స్ ఫ్యామిలీ ఆడియెన్స్‌కి ఎక్కలేదు.
టెక్నికల్ గా చూస్తే…
BGM – ఓకే.
సినిమాటోగ్రఫీ – పాస్.
ఎడిటింగ్ – ఫస్ట్ హాఫ్‌లో సీన్స్ రిపీట్ కావడం వల్ల లూజ్.
ప్రొడక్షన్ డిజైన్ – జస్ట్ ఫంక్షనల్.
సీజీ & ఆర్ట్ వర్క్ విషయంలో చాలా కేర్ తీసుకోవాలి.
పర్ఫార్మెన్స్ రిపోర్ట్
ప్రవీణ్: టిపికల్ మిడ్-క్లాస్ రోల్‌లో కంఫర్ట్ జోన్ పర్ఫార్మెన్స్.
వివా హర్ష: ఫ్లాష్‌బ్యాక్ లో ఎమోషనల్ డెప్త్ లేక, క్యారెక్టర్ కేవలం కారికేచర్‌లా మారింది.
శ్రీకాంత్ అయ్యంగార్: బాస్ రోల్‌లో ఇంపాక్ట్.
కృష్ణ భగవాన్: సిగ్నేచర్ స్టైల్‌లో తిరిగి కనిపించినా, హాస్యం తక్కువ.
సెకండాఫ్ లో వచ్చే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ల కామెడీ కొంతమందికి నచ్చవచ్చు కానీ.. అదేమీ పెద్ద గొప్పగా లేదు.
ఫైనల్ వెర్డిక్ట్
కామెడీ హారర్ అంటే కామెడీ & హారర్ రెండూ సింక్ అవ్వాలి. కానీ ఇక్కడ రెండూ మిస్సయ్యాయి. స్టోరీ, రైటింగ్ స్ట్రాంగ్ కాకపోవడంతో మొత్తం సినిమా హాఫ్ బేక్ ఫీలింగ్ ఇస్తుంది. ఏదైమైనా కథ, క్యాస్టింగ్ డీసెంట్ గా ఉన్నప్పటికీ.. ఎగ్జిక్యూషన్ లో దొర్లిన తప్పుల కారణంగా “బకాసుర రెస్టారెంట్” పూర్తిస్థాయిలో అలరించలేకపోయింది.