సినిమా వార్తలు

హైదరాబాద్‌ వీధుల్లో ప్రియాంకా.. మహేష్ కామెంట్‌కు రిప్లై ఇదేనా?

రాజమౌళి–మహేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న భారీ గ్లోబల్ అడ్వెంచర్ డ్రామా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. నవంబర్ 15న టైటిల్ రివీల్ ఈవెంట్ గ్రాండ్ గా జరుగనుండగా, దాని ముందు హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది.

ఇంతలో, చిన్న గ్యాప్ తర్వాత ప్రియాంకా చోప్రా ఈరోజు ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. ఫ్లైట్ జ‌ర్నీ ఫొటోలు, హోటల్‌కి వెళ్తూ నగర వీధుల షార్ట్ క్లిప్స్ షేర్ చేస్తూ హైప్ పెంచేశారు. ఇటీవల మహేష్ బాబు “ప్రియాంకా హైదరాబాద్‌ గల్లీలన్నీ ఫోటోలు తీస్తోంది” అని సరదాగా అన్న విషయం తెలిసిందే. దానికి రిప్లైగా ప్రియాంకా కూడా హైడ్రో గల్లీ వీడియో పెట్టి ఫ్యాన్స్ ని నవ్వించారు.

ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌ను ‘గ్లోబ్‌ట్రాటర్’ లేదా SSMB29 అని పిలుస్తున్నారు. మహేష్ బాబు – ప్రియాంకా చోప్రా లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్న ఈ మాగ్నమ్ ఓపస్ టైటిల్ గ్లింప్స్ ఈవెంట్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది. ఈ ఈవెంట్‌ను నవంబర్ 15 సాయంత్రం JioHotstar లో లైవ్‌ స్ట్రీమ్ చేయనున్నారు.

శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ఎల్. నారాయణ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి ఎమ్‌ఎమ్‌ కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. రాజమౌళి స్కేల్ అంటే ఏంటో మరోసారి చూపించేలా భారీగా రూపుదిద్దుకుంటోంది అనేది ఇండస్ట్రీ టాక్!

మరి టైటిల్ ఏమిటి? లుక్ ఎలా ఉండబోతోంది?
ఫ్యాన్స్ మాత్రం “ఈ సారి రాజమౌళి ఏ ప్రపంచాన్ని చూపిస్తారో?” అని కౌంట్‌డౌన్‌ స్టార్ట్ చేశారు!

Similar Posts