ప్రముఖ దర్శకుడు రాజమౌళి తాను మహేశ్‌తో చేస్తున్న ప్రాజెక్టు కోసం ప్రియాంకను హీరోయిన్ గా ఎంపిక చేశారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రియాంక ఈరోజు హైదరాబాద్ విమానాశ్రయంలో కనిపించారు. దాంతో నెటిజన్లు ‘ఎస్ఎస్ఎంబీ29’ కోసమే వచ్చారంటూ పోస్టు పెడుతున్నారు. దీనికి ఆమె ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చేసిన ఓ పోస్టు ఊతం ఇస్తోంది. ఆ పోస్ట్ లో ఏముంది.
ఆ పోస్ట్ లో ప్రియాంక … ఓ వీడియోను ప్రియాంక చోప్రా పంచుకున్నారు. వీడియోలో టొరంటో నుంచి దుబాయికి, అక్కడి నుంచి హైదరాబాద్‌కు పయనమైనట్లు తన జర్నీ వివరాలను ఆమె తెలియజేశారు. దీనికి ‘ఆర్ఆర్ఆర్’ రోరింగ్ బీజీఎంను ప్రియాంక యాడ్ చేశారు. దాంతో రాజమౌళి-మహేశ్ ప్రాజెక్టుపై ఆమె ఇన్‌డైరెక్ట్‌గా హింట్ ఇచ్చారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
ఈ సినిమా ఓ అడ్వెంచర్ యాక్షన్ డ్రామాగా ఉండబోతుందని రచయిత విజేంద్రప్రసాద్ ఇప్పటికే వెల్లడించారు. ఇందులో హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా భాగం కాబోతున్నారని సమాచారం.
దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణ ఈ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు జక్కన్న అన్ని సినిమాలకు బాణీలు అందించిన ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి కూడా సంగీతం అందించనున్నారు.
ఈ సినిమా షూటింగ్‌పై త్వరలోనే అధికారిక అప్‌డేట్ వచ్చే అవకాశం ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రీసెంట్ గా చిత్ర టీమ్ హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాల్ని నిర్వహించి సినిమాకి శ్రీకారం చుట్టింది.
కథానేపథ్యం మినహా, ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకూ అధికారికంగా ఎలాంటి సమాచారాన్ని బయట పెట్టలేదు. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో పలువురు విదేశీ నటులు కనిపించనున్నారు. భారతీయ భాషలతో పాటు, విదేశీ భాషల్లోనూ దీనిని అనువదించనున్నారు.