టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌కు ఉన్న ఫ్యాన్‌బేస్ వేరు. కానీ వరుస పరాజయాలు ఆయన కెరీర్‌ను కుదిపేశాయి. ముఖ్యంగా ‘లైగర్’ ఘోర పరాజయం తర్వాత, “ఇక పూరి పని అయిపోయిందేమో..” అనుకునే పరిస్థితి వచ్చింది.

కానీ అన్ని అంచనాలను తలకిందులు చేస్తూ.. ఒక్కసారిగా తమిళ స్టార్ విజయ్ సేతుపతి‌తో పూరి నెక్స్ట్ మూవీని అనౌన్స్ చేసి షాక్ ఇచ్చేశారు. అంతే కాదు.. ఈ సినిమాలో సంయుక్తా, టబు, బ్రహ్మాజీ, వీటీవీ గణేష్ వంటి టాప్ నటులు కూడా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

పూరి కనెక్ట్స్‌, జెబీ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు.

టైటిల్ ఏంటంటే?

సెప్టెంబర్ 28న పూరి బర్త్‌డే సందర్భంగా చెన్నై గ్రీన్ పార్క్ హోటల్‌లో టైటిల్ & టీజర్ రిలీజ్ అవుతున్నాయి. ‘బిక్షాందేహి’, ‘మాలిక్’, ‘బెగ్గర్’ వంటి పేర్లు ట్రెండ్ అయినా.. చివరికి ‘స్లమ్‌డాగ్’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఫైనల్ చేశారు.

ఈ సినిమా ‘మనీ హీస్ట్’ స్టైల్ జానర్‌లో సాగబోతుందని ఇండస్ట్రీ టాక్. ఇందులో విజయ్ సేతుపతి ఓ బిక్షగాడి పాత్రలోనే కీలక రోల్ పోషించనున్నాడు అని అంతర్గత వర్గాల సమాచారం.

కథలో పేదవాడి నుంచి ధనవంతుడి వరకు ఓ లైఫ్‌ జర్నీని చూపించబోతున్నారని టాక్. ఇప్పుడు అభిమానులు ఈ సినిమాతోనే పూరి మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి వస్తాడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు!

, , , , , ,
You may also like
Latest Posts from