
పవన్ అభిమానులు, సినీ ప్రేముకులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూసిన ‘ఓజీ’ (OG) విడుదలైంది. ఫ్యాన్స్ ఆశించినట్టే హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత వసూలు చేసిందన్న ప్రశ్నకు చిత్ర టీమ్ తాజాగా సమాధానమిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ.154కోట్లకుపైగా వసూలు (OG First Day Collectons) చేసిందని నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ మేరకు పవర్‌ఫుల్ పోస్టర్ పంచుకుంటూ ‘ఇది పవన్ కల్యాణ్ సినిమా. చరిత్రను ఓజీ చెరిపేసింది’ అని క్యాప్షన్ పెట్టింది.
ప్రీమియర్స్‌లోనూ అత్యధిక వసూళ్లు (గ్రాస్) రాబట్టిన సినిమాగా ‘ఓజీ’ నిలిచింది. అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కావడమే ఆలస్యం టికెట్లు అత్యంత వేగంగా అమ్ముడుపోయాయి. తొలిరోజు ఈ స్థాయి కలెక్షన్లు పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే ఓ రికార్డు. ఫస్ట్ డే అత్యధిక వసూలు చేసిన టాప్-10 భారతీయ సినిమాల జాబితాలో ‘ఓజీ’ చోటు దక్కించుకుంది. ఆయా చిత్ర టీమ్ అధికారికంగా ప్రకటించిన తొలి రోజు కలెక్షన్స్ మేరకు.. టాలీవుడ్ నుంచి ఏడో చిత్రమిది.
అయితే సెకండ్ డేకి వచ్చేసరికి సీన్ కొంచెం మారింది. ట్రేడ్ టాక్ ప్రకారం, ఆంధ్ర – తెలంగాణలో కలిపి ₹18 కోట్లు ప్లస్ షేర్ మాత్రమే రాబట్టగలిగింది. అందులోనూ నిజాం alone లో ₹7 కోట్లు వచ్చిందని తెలుస్తోంది.
ట్రేడ్ సర్కిల్స్ మాటల్లో – “ప్రీమియర్, ఫస్ట్ డేలో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కానీ సెకండ్ డే కలెక్షన్లు కొంచెం తగ్గాయి. వీకెండ్‌లో పిక్ అవుతుందా లేదా అనేదే ఇప్పుడు కీలకం. లేని పక్షంలో డిస్ట్రిబ్యూటర్స్‌కు రిస్క్ పెరుగుతుంది” అంటున్నారు.
మొత్తానికి – బ్రేక్ ఈవెన్ కోసం తెలుగు రాష్ట్రాల్లో సుమారు ₹145 కోట్లు కావాలి. ఇక ఫ్యాన్స్ హోప్స్ అంతా వీకెండ్‌పైనే!
ఇక తాను ఆరాధించే హీరోతో ఓ అభిమాని సినిమా తీస్తే ఎలా ఉంటుందో ‘ఓజీ’ మరోసారి రుజువు చేసింది. తనలాంటి ఎంతోమంది ఫ్యాన్స్ కొంతకాలంగా పవన్ సినిమాల్లో ఏం మిస్ అవుతున్నారో దాన్ని భర్తీ చేశారు దర్శకుడు సుజీత్. ఆయన స్టైలిష్ మేకింగ్, పవన్ లుక్స్, మ్యానరిజం, యాక్షన్, తమన్ నేపథ్యం హైలైట్. యూనివర్స్ క్రియేట్ చేసే ఆలోచన ఉందని దర్శకుడు ఇప్పటికే వెల్లడించారు. అందులో ప్రభాస్ నటిస్తారా? అన్న దానిపై ఇప్పుడేం ఏం చెప్పలేనన్నారు.
