
ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్స్, గీతా ఆర్ట్స్ సంస్ద అథినేత అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్ సినిమాల్లో పలు ప్రయత్నాలు చేసినా, ఆశించిన స్థాయిలో సక్సెస్ రాలేదు. మధ్యలో గ్యాప్ తీసుకుని మళ్లీ రీఎంట్రీ ఇచ్చినా పెద్ద హిట్ అందుకోలేకపోయాడు. చివరిసారిగా టెడ్డీ సినిమాలో కనిపించిన ఆయన, ప్రస్తుతం ముంబైలో స్థిరపడ్డాడు.
ఇక అసలు విషయానికి వస్తే.. ఇటీవల జరిగిన కొన్ని సినీ ఈవెంట్స్‌లో అల్లు శిరీష్ పెళ్లి గురించి చర్చ జోరుగా నడిచింది. అయితే శిరీష్ మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ, తాజా బజ్ ప్రకారం… హైదరాబాదులోని ఓ బిజినెస్ మ్యాన్ కూతురితో అల్లు శిరీష్ వివాహం ఖరారైందట.
ఇరు కుటుంబాలు కలుసుకుని పెళ్లి విషయంపై మాట్లాడుకున్నారట. అయితే ఇటీవల అల్లు అరవింద్ తల్లి, అల్లు కనకరత్నం గారు కన్నుమూయడంతో పెళ్లి ప్రణాళికలు కొంత వెనక్కి వెళ్లాయి. సరైన సమయానికి అల్లు శిరీష్ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించనున్నారని టాక్.
ఇంకా మెగా క్యాంప్ లో సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ పెళ్లిళ్లు కూడా పెండింగ్‌లోనే ఉండటంతో… ఇప్పుడు ఫ్యాన్స్‌లో అసక్తి మరింత పెరిగిపోయింది!
