
ప్రపంచ సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డులు… వాటి రేసులో ఈసారి టాలీవుడ్ తనదైన ముద్ర వేయబోతోంది. భారత్ తరఫున అధికారిక ఎంట్రీ కోసం ఏకంగా ఐదు తెలుగు సినిమాలు పరిశీలనలోకి రావడం ఇండస్ట్రీలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది.
భారీ పాన్-ఇండియా అంచనాలతో తెరకెక్కిన ‘పుష్ప 2: ది రూల్’, ‘కుబేర’, ‘కన్నప్ప’ లాంటి మాస్ అట్రాక్షన్ చిత్రాలు ఒకవైపు నిలవగా… వినూత్నమైన కథనంతో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మరోవైపు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా చిన్నారుల కోసం రూపొందిన ‘గాంధీ తాత చెట్టు’ కూడా ఆస్కార్ పోటీలో నిలవడం టాలీవుడ్ వైవిధ్యాన్ని రుజువు చేస్తోంది.
యాక్షన్, పౌరాణికం, సామాజికం, పిల్లల కథనం – అన్ని జానర్లు కలిసిన ఈ లైన్-అప్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సాధారణంగా దేశం నుంచి ఒకే సినిమా ఎంపికై ఆస్కార్ రేసులోకి వెళ్తుంది. అయితే ఈసారి తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన ఐదు సినిమాలే ఓ సెన్సేషన్‌గా మారాయి.
వీటిన్నింటిలో ఏ సినిమా ఇండియా నుంచి అధికారిక ఎంట్రీ అవుతుందో అన్న ఆసక్తి సినీ ప్రపంచంలో డిస్కషన్ గా మారింది!
