ఒక టైమ్ లో కమర్షియల్ హీరోయిన్ కి కేరాఫ్ ఎడ్రస్ గా వెలిగిపోయింది రాశిఖన్నా. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషలలో కూడా సక్సెస్ అయ్యే ప్రయత్నం చేస్తోంది. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రాశిఖన్నా ఈ మధ్యన వెనకబడింది. దాంతో ఇదిగో ఇలా అందాల ప్రదర్శనకు తెర తీసింది.

రాశీ తాజాగా తన ఫిట్నెస్ గురూ కుల్ దీప్‌తో కలిసి జిమ్ లో శ్రమిస్తున్న కొన్ని ఫోటోలను షేర్ చేసింది. రాశీ పర్ఫెక్ట్ ఫిట్ టోన్డ్ బాడీని హైలైట్ చేస్తూ ఈ ఫోటోషూట్ గుబులు పుట్టిస్తోంది.

బ్లాక్ అండ్ బ్లాక్ – ఆల్ బ్లాక్ ట్రాక్ లో ఉన్న ఈ ఫోటోగ్రాఫ్స్ ఇంటర్నెట్ లో తుఫాన్ సృష్టిస్తున్నాయి. రాశీ నడుము నెమ్మదిగా జీరో నుంచి మైనస్ సైజ్ కి తగ్గిపోవడం ఖాయమని ఈ హార్డ్ వర్క్ చెబుతోంది. కొంత కఠినమైన వ్యాయామ సెషన్స్ కి రాశీ ఖన్నా అటెండవుతోంది.

“నేను ఏడవకుండా ఆ సెషన్‌లో బయటపడ్డాను. సెల్ఫీలు తీసుకునేంత అందంగా అనిపించింది! అంటూ కొంటె ఫన్నీ ఈమోజీని రాశీ షేర్ చేసింది. రాశీని షేపప్ చేసేందుకు కోచ్ కుల్ దీప్ సేథి చాలా శ్రమిస్తున్నారనడానికి ఈ ఫోటోలే ప్రూఫ్.

తెలుగులో ఆమె చివరిగా నాగ చైతన్యకి జోడీగా ‘థాంక్యూ’ మూవీలో కనిపించింది. అలాగే గోపిచంద్ తో పక్కా కమర్షియల్ సినిమా చేసింది. ఇవేవీ కూడా ఆమెకు వర్కవుట్ కాలేదు.

దాంతో తెలుగుని వదిలేసి తమిళ్, హిందీ భాషలలో మాత్రం రాశిఖన్నా బాగానే అవకాశాలు అందుకుంటుంది. థాంక్యూ తర్వాత తమిళంలో ‘తిరు’, ‘సర్దార్’, ‘అరణ్మణై 4’ సినిమాలు చేసి సక్సెస్ లు అందుకుంది.

హిందీలో ‘యోధ’ అనే చిత్రాన్ని చేసింది. కానీ ఆ మూవీ డిజాస్టర్ అయ్యింది. అయితే ఓటీటీలో ‘రుద్ర’, ‘ఫర్జీ’ వెబ్ సిరీస్ ద్వారా తనకంటూ పేరు తెచ్చుకుంది.

రాశిఖన్నా నటిగా 2013లో ‘మద్రాస్ కేఫ్’ సినిమాతో అరంగేట్రం చేసింది. జాన్ అబ్రహం హీరోగా ఈ సినిమా తెరకెక్కింది. మరల 10 ఏళ్ళ తర్వాత ‘యోధ’ ద్వారా హిందీలో మళ్ళీ రాశిఖన్నా కనిపించింది. బాలీవుడ్ లో ఈ సినిమా కూడా ఆమెకి సక్సెస్ ఇవ్వలేదు.

హిందీలో విక్రాంత్ మాస్సే హీరోగా తెరకెక్కిన ‘ది సబర్మతి రిపోర్ట్’ సినిమాలో రాశిఖన్నా హీరోయిన్ గా చేసింది. వాస్తవ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిన ఈ సినిమా కూడా అంతంత మాత్రమే అయ్యింది.

అత్యంత వివాదాస్పద చిత్రంగా సిద్ధమైన ‘ది సబర్మతి రిపోర్ట్’ మూవీ పై ఆమె చాలా హోప్స్ పెట్టుకుంది. ఈ చిత్రంలో హిందీలో హీరోయిన్ గా కమర్షియల్ బ్రేక్ వస్తుందని ఆశ పడింది.

తెలుగులో ‘తెలుసు కదా’ అనే సినిమాలో సిద్దు జొన్నలగడ్డకి జోడీగా రాశిఖన్నా నటిస్తోంది. ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.

అలాగే తమిళంలో ‘అరణ్మణై 5’, అలాగే ‘అగత్యా’ మూవీస్ చేసింది. హిందీలో ‘TME’ అనే మూవీ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.