
మహేష్ – రాజమౌళి షాక్: ఎటువంటి హింట్ లేకుండా గ్లోబ్‌ట్రాట్టర్ ట్రైలర్ రిలీజ్!
మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్ అంటేనే ఊహల్లోకి తీసుకెళ్లే కాంబో. ఇప్పటి వరకూ ఒక్క అప్డేట్కోసం అభిమానులు ఎదురుచూస్తూ ఉండగా, ఈసారి రాజమౌళి తన స్టైల్లోనే గేమ్ మార్చేశాడు! ఎటువంటి హింట్ లేకుండా ట్రైలర్‌ను నేరుగా రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు బయటకు వచ్చాయి.
నవంబర్ మొదటి వారంనుంచే SSMB29 టీమ్ ప్రమోషన్స్‌ను సైలెంట్‌గా, కానీ స్ట్రాటజిక్‌గా మొదలెట్టింది. మొదట ట్విట్టర్ ఇంటరాక్షన్, ఆ తర్వాత జియో హాట్‌స్టార్ స్ట్రీమింగ్ పార్ట్నర్గా అనౌన్స్ చేయడం, అలాగే రామోజీ ఫిల్మ్ సిటీలో 100 అడుగుల స్క్రీన్‌తో భారీ ఈవెంట్ ప్లాన్ చేయడం — ఇవన్నీ ఒక్కొక్కటిగా హైప్ పెంచేశాయి.
ఇక కొన్ని రోజుల క్రితమే ఎం.ఎం. కీరవాణి ఒక మాస్ సాంగ్‌ను అన్ ఎక్స్‌పెక్టెడ్‌గా డ్రాప్ చేయడంతో అభిమానులు ఉత్సాహంలో మునిగిపోయారు. ఆ పాట పాడిన శృతి హాసన్ ఈ ఈవెంట్లో లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతుందని కూడా సమాచారం.
అయితే రాజమౌళి సర్ప్రైజ్లు ఇక్కడితో ఆగలేదు! జియో హాట్‌స్టార్ ద్వారా 15వ నవంబర్ నాడు నేరుగా “గ్లోబ్‌ట్రాట్టర్” ట్రైలర్ విడుదల కానుందని తెలిసింది. అంటే, టీజర్ లేకుండా, నేరుగా ఫుల్ ట్రైలర్‌తోనే రాజమౌళి బ్లాస్ట్ చేయబోతున్నారు!
ఈ నిర్ణయం వెనుక రాజమౌళి గ్లోబల్ విజన్ స్పష్టంగా కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లలో బజ్ క్రియేట్ చేయడానికి కంటెంట్‌ను గరిష్టంగా రివీల్ చేయాలన్న వ్యూహంతో ఈ స్టెప్ తీసుకున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.
ఇప్పుడు ఒక్క మాటే —
“ట్రైలర్ వస్తోంది… ప్రపంచం చూడబోతోంది!” .
నిజంగా రాజమౌళి – మహేష్ కాంబో మరోసారి చరిత్ర రాయబోతుందా? 15వ నవంబర్‌కి సమాధానం దొరుకుతుంది!
