సూపర్ స్టార్ రజినీకాంత్ కి (Rajinikanth)కి వయస్సు పెరుగుతున్నా క్రేజ్ ఏ మాత్రం తగ్గట్లేదు. ‘జైలర్’ (Jailer)సినిమాతో ఆ విషయం ప్రూవ్ అయ్యింది. ఈ క్రమంలో ఆయన నెక్స్ట్ మూవీ ‘కూలీ’ (Coolie) ప్రీ రిలీజ్ బిజినెస్ ట్రేడ్ లో షాకిస్తోంది. ఈ సినిమాకి లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహిస్తున్నారు. నాగార్జున(Nagarjuna), ఉపేంద్ర (Upendra) వంటి స్టార్స్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
‘కూలీ’ సినిమా డిజిటల్ రైట్స్ కూడా భారీ రేటుకు అమ్ముడుపోయినట్టు తెలుస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ‘కూలీ’ సినిమా డిజిటల్ రైట్స్ ను ఏకంగా రూ.120 కోట్లకి విక్రయించారట.
ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ.280 అవుతున్నట్టు ప్రచారం జరిగింది. అలా చూసుకుంటే.. ఓటీటీల నుండి అప్పుడే రూ.120 కోట్లు వచ్చేసినట్టే..!
లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా స్టార్ట్ చేసినప్పటి నుండి అటు ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఓటీటీ హక్కుల విషయంలో ఈ సినిమా క్రేజ్ ఏ స్థాయిలో ఉందో తెలిపింది.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తుండగా సన్ పిచ్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్నారు.