సూపర్ స్టార్ రజనీకాంత్ – యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ‌కలిసి చేస్తున్న సినిమా ‘కూలీ’. ఇందులో అమీర్ ఖాన్, నాగార్జున, ఉపేంద్ర నటించారు. ప్రేక్షకులలో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆగస్టు 14న ఈ సినిమా థియేటర్లలోకి రానున్న సంగతి తెలిసిందే. వార్ 2 వంటి భారీ సినిమాలతో పోటీ ఉన్నా కూడా ఈ సినిమాపై క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తల ప్రకారం, సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాకు సంబంధించి సుమారు రూ. 500 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ ను పూర్తి చేసినట్లు సమాచారం!

అందులో ఇండియాలో థియేట్రికల్ రైట్స్ ద్వారా రూ. 300 కోట్లకు పైగా వసూలయ్యాయని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే గ్లోబల్ గా రూ. 500 కోట్లు కలెక్షన్ రావాల్సి ఉంటుంది.

బంగారం స్మగ్లింగ్ నేపథ్యంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇప్పటికే ప్రోమోషనల్ మెటీరియల్‌లో ‘గోల్డ్’ అంశాన్ని హైలైట్ చేశారు. అయితే, దర్శకుడు లోకేష్ కనగరాజ్ స్పష్టం చేశారు – ఈ సినిమా ఆయన ‘ఎల్సీయూ’లో భాగం కాదని!

ఈ చిత్రంలో రజినీకాంత్ తో పాటు నాగార్జున అక్కినేని, ఉపేంద్ర, సౌబిన్ షాహీర్, సత్యరాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. బాలీవుడ్ ఖాన్ ఆమిర్ ఖాన్ ఓ స్పెషల్ క్యామియోలో మెరిసిపోనున్నారు. పూజా హెగ్డే ఒక మాస్ ఐటెం సాంగ్ లో సందడి చేస్తే, శృతిహాసన్, రేబా మోనికా జాన్ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.

ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో ఇప్పటికే రికార్డులు బద్దలవుతున్న ‘కూలీ’పై ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ ఆగస్ట్ 15 న విడుదల కానున్న ఈ సినిమాను చూసేందుకు సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు!

“బంగారం స్మగ్లింగ్ కథ, రజినీ మాస్, లోకేష్ క్లాస్ – కూలీ ఓ మాస్ బ్లాస్ట్ కావబోతోంది!”

, , , , ,
You may also like
Latest Posts from