రజినీకాంత్ – లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో వచ్చిన కూలీ ఇంకా రిలీజ్ కాకముందే రికార్డులు బద్దలు కొడుతోంది. థియేటర్లలోకి రావడానికి ఒక్క రోజు మిగిలి ఉండగానే, ఈ యాక్షన్ డ్రామా 2025లో అతిపెద్ద ఓపెనర్‌గా నిలిచింది.
రామ్ చరణ్ గేమ్ చేంజర్ 85 కోట్ల వరల్డ్‌వైడ్ గ్రాస్‌తో ఈ ఏడాది టాప్ ఓపెనర్‌గా ఉన్న రికార్డును, కూలీ కేవలం ప్రీ-సేల్స్‌తోనే అధిగమించింది. ఇప్పటివరకు 90 కోట్ల వరల్డ్‌వైడ్ ఓపెనింగ్ డే బుకింగ్స్ సాధించిన ఈ చిత్రం, మొదటి షో మొదలయ్యేలోపే 100 కోట్ల మార్క్‌ను దాటేలా దూసుకెళ్తోంది.
తమిళ, తెలుగు ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ భీకరంగా జరుగుతున్నాయి. హిందీలో కూడా అంచనాలకు మించి రిస్పాన్స్ వస్తోంది. కూలీ 150 కోట్లకు పైగా గ్రాస్‌తో కోలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద ఓపెనింగ్ సాధించే దిశగా దూసుకుపోతోంది. 2025లో నంబర్ వన్ ఓపెనర్‌గా దాని స్థానం ఖరారయ్యింది.