మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తున్న భారీ ప్రాజెక్ట్ పెద్ది షూటింగ్ మైసూరులో కొనసాగుతోంది. ఈ షెడ్యూల్‌లో జానీ మాస్టర్ కొరియోగ్రఫీతో వెయ్యి మందికి పైగా డ్యాన్సర్లుతో అద్భుతమైన పాటను చిత్రీకరిస్తున్నారు.

ఇంతలోనే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా మైసూరులో ఉండటంతో, రామ్ చరణ్ ప్రత్యేకంగా ఆయనను కలిసి శాలువాతో సత్కరించారు. సినిమా సంగతులపై కొన్ని ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు. ఈ సందర్భం స్థానికంగా మంచి చర్చనీయాంశమైంది.

బుచ్చిబాబు సానా దర్శకత్వంలో, కిలారు వృద్ధి సినిమాస్ పతాకంపై రూపొందుతున్న పెద్ది ప్రాజెక్ట్‌ బడ్జెట్‌ పరంగా, స్కేల్‌ పరంగా, అంచనాల పరంగా చాలా భారీగా సాగుతోంది. ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్‌లో మరో సెన్సేషనల్ హిట్ అవుతుందన్న నమ్మకం ఫిలిం సర్కిల్స్‌లో ఉంది.

ఫైనల్ గా బేటీ వెనక ఒక టాక్ మాత్రం గట్టిగా వినిపిస్తోంది. రామ్ చరణ్‌కి కర్ణాటక మార్కెట్ తప్పనిసరిగా కావాలి. అందుకే సీఎం సిద్ధరామయ్యను ప్రత్యేకంగా కలిశారనే గుసగుసలు ఫిలిం నగరంలో జోరుగా వినిపిస్తున్నాయి.

, , , , ,
You may also like
Latest Posts from