సినిమా వార్తలు

“ఆంధ్ర కింగ్ తాలూకా” రేపే రిలీజ్.. బజ్ ఏది.. ఎక్కడుంది సమస్య?

రామ్ ఈ సారి మాస్ కాదు… క్లాస్ కాదు… సెన్సిబుల్ ఎమోషనల్ లవ్ స్టోరీతో వస్తున్నాడు. “ఆంధ్ర కింగ్ తాలూకా” అనేది రామ్ ఇప్పటివరకు చేసిన సినిమాల్లో డిఫరెంట్ అటెంప్ట్. పాటలు ఇప్పటికే మంచి హైప్ తెచ్చుకున్నా… రిలీజ్‌కు ఇంకో రెండు రోజులు మాత్రమే ఉండగా ప్రి-రిలీజ్ బిజినెస్ & అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం అంచనాలకు తగ్గట్టుగా లేవు.

అందుకే రామ్, భాఘ్యశ్రీ బోర్సే కలిసి USA టూర్కు వెళ్లి ప్రమోషన్స్‌ మీద ఫుల్ ఫోకస్ పెట్టారు. మేకర్స్ ప్రమోషన్స్‌లో తమ వంతు పని పూర్తిగా చేశారు. ఇక సినిమాను లేపేది ఒక్కటే—

స్ట్రాంగ్ & పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్!

ఈ సినిమా కోసం రామ్ తన రెగ్యులర్ కమర్షియల్ పాత్ నుండి బయటకు వచ్చి రిస్క్ తీసుకున్నాడు. ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించబోతుండగా, భాఘ్యశ్రీ గ్లామర్ కూడా సినిమాకు పెద్ద ప్లస్‌పాయింట్‌గా చెబుతున్నారు.

మేకర్స్ మాత్రం సినిమాపై ఎక్స్‌ట్రీమ్ కాన్ఫిడెంట్.

ఇక నిజంగా రామ్‌ను సక్సెస్ ట్రాక్‌కు తిరిగి తీసుకెళ్లేది ఈ “ఆంధ్ర కింగ్ తాలూకా”నే అవుతుందా?

భాగ్యశ్రీ బోర్సే కెమిస్ట్రీ: హీరో, హీరోయిన్ల మధ్య రొమాంటిక్ ట్రాక్ అద్భుతంగా పండింది. వివేక్-మెర్విన్ అందించిన మ్యూజిక్, ముఖ్యంగా నేపథ్య సంగీతం సినిమాకు అతిపెద్ద బలం. హీరో-తండ్రి మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు సినిమాకు కోర్ స్ట్రెంగ్త్‌గా నిలిచాయి. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర నటించిన పాత్ర (సూర్య కుమార్) హైలైట్‌గా, కీలక మలుపులకు దారి తీస్తుందని టాక్.

పల్లెటూరి వాతావరణం, అలాగే దేవాలయానికి సంబంధించిన సన్నివేశాలు చాలా అద్భుతంగా తెరకెక్కించారట. అలాగే చివరి 45 నిమిషాల భావోద్వేగ ప్రయాణం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. మొత్తం మీద, రామ్ పోతినేని ఖాతాలో నవంబర్ 27న ఒక ఖచ్చితమైన బ్లాక్‌బస్టర్ పడడం ఖాయంగా కనిపిస్తోంది.

Similar Posts