బాలీవుడ్ ప్రేమజంట రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ ఇప్పుడు కెరీర్‌గా, వ్యక్తిగతంగా ఓ హ్యాపీ స్పేస్‌లో ఉన్నారు. ఒకవైపు భారీ రెమ్యునరేషన్‌లతో సినిమాలు వరుసగా చేస్తూ… మరోవైపు తమ కలల ఇల్లు సిద్ధమవుతుండటంతో, జీవితంలో మరో మెరుగైన మైలురాయిని చేరుకుంటున్నారు.
బాంద్రా వెస్ట్‌లో విలాసవంతమైన ప్రాంతంలో నిర్మితమవుతున్న వారి కొత్త బంగళా ఇప్పుడు పూర్తయింది. రూ. 250 కోట్లను ఖర్చుచేసి నిర్మించిన ఈ ఆరు అంతస్థుల ప్రైవేట్ విల్లా ఇప్పుడు వారి “డ్రీమ్ హోమ్”గా మారింది. ఈ ఇంటి పనులు గత కొన్నేళ్లుగా నడుస్తుండగా, ఇటీవల ఆలియా భట్ తన అత్త నీతూ కపూర్‌తో కలిసి అక్కడికి వెళ్లింది.
ఇంట్లోకి అడుగుపెట్టే ముందే ఘనమైన గృహప్రవేశ వేడుక నిర్వహించనున్నారు. సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, ఈ జీవిత ఘట్టాన్ని కుటుంబంతో కలిసి జరుపుకోబోతున్నారు.
ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్ “రామాయణం” షూటింగ్‌లో బిజీగా ఉండగా, ఆలియా భట్ యాష్ రాజ్ ఫిలింస్ రూపొందిస్తున్న స్పై యూనివర్స్‌లో భాగమైన “ఆల్పా” సినిమాలో నటిస్తోంది.
2022లో పెళ్లి చేసుకున్న రణ్‌బీర్–ఆలియా దంపతులకు “రాహా” అనే పాప పుట్టింది. ఇప్పుడు కుటుంబంతో కలసి కొత్త ఇంట్లోకి అడుగుపెట్టేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.