సినిమా వార్తలు

పబ్లిక్‌లో ముద్దు… ఇంటర్వ్యూలో హింట్… రష్మిక రచ్చ మామూలుగా లేదుగా!!

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండతో సీక్రెట్‌గా ఎంగేజ్ అయ్యిందన్న టాక్ చాలాకాలంగా నెట్‌లో చక్కర్లు కొడుతోంది. ఇద్దరూ ఎప్పుడూ ఓపెన్‌గా అనౌన్స్ చేయకపోయినా… పబ్లిక్‌లో వాళ్ల బిహేవియర్ చూస్తే అంతా అందరికి అర్దమైపోతోంది!

ఇటీవల “ది గర్ల్‌ఫ్రెండ్” మూవీ సక్సెస్ సెలబ్రేషన్‌లో మీడియా ముందే విజయ్ రష్మిక చేతిని పట్టుకుని ముద్దుపెట్టడం—అదే అసలు కన్ఫర్మేషన్ అన్న మాట!

అంతేకాదు… తాజా ఇంటర్వ్యూలో రష్మిక ఓ డైరెక్ట్ హింట్ ఇచ్చింది.

“ఒకప్పుడు రిలేషన్‌లో నాకు ఛాయిస్ లేదన్న భావన ఉండేది… కానీ ఇప్పుడు? నేను ఎంచుకున్న వ్యక్తి నన్ను నిజంగా హ్యాపీగా ఉంచుతున్నాడు. నేను హ్యాపీగా ఉన్నాను, ఆయన కూడా హ్యాపీగానే ఉన్నాడు…” అని చెప్పింది.
పేరు చెప్పలేదు… కానీ ఎవరని చెప్పాల్సిన అవసరమే ఉందా?

అంతలోనే ఇండస్ట్రీలో మరో షాక్ రూమర్…
2026 ఫిబ్రవరిలో ఉదయపూర్‌లోని ఓ లగ్జరీ ప్యాలెస్ హోటల్‌లో వీళ్ల పెళ్లి?
సోర్సులు మాత్రం ఇది ఫిక్స్ అయిపోయిందని గట్టిగానే చెబుతున్నాయి.

ఇంకా ఎలాంటి ట్విస్ట్‌లు బయటకు రావో చూడాలి!

Similar Posts