పుష్ప, యానిమల్ తర్వాత రష్మిక మందన్న రేంజ్ ఏంటో ఇంకోసారి ప్రూవ్ అయింది. అందం, ఆటిట్యూడ్, యూత్‌పుల్ కనెక్ట్ తో పాన్ ఇండియా మార్కెట్‌ని గెలుచుకున్న ఈ నేషనల్ క్రష్, సినిమాలు రిలీజ్ తర్వాతే కాదు రిలీజ్ ముందు కూడా ఇండస్ట్రీని బిజినెస్ పరంగా షాక్ చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా రాబోతున్న ‘ది గర్ల్‌ఫ్రెండ్’ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజిలో జరిగిందని ట్రేడ్ వర్గాల సమాచారం!
రిలీజ్‌కంటే ముందే రూ.21 కోట్ల రచ్చ!
సినిమా థియేటర్స్‌లోకి వచ్చేలోపే నాన్ థియేట్రికల్ మార్కెట్‌లో జోరుగా దూసుకెళ్లింది.
OTT (Netflix): ₹14 కోట్లు
శాటిలైట్: ₹4 కోట్లు
ఆడియో: ₹3 కోట్లు
టోటల్: ₹21 కోట్లు!
ఇప్పుడు మార్కెట్‌లో పెద్ద హీరో సినిమాలకు కూడా డీల్స్ క్లోజ్ అవ్వడం కష్టమని మాట్లాడుకుంటున్న సమయంలో… రష్మిక ఒక్క పేరుతో ఈ ఫీట్ అంటే ఆమె క్రేజ్ లెవల్ ఏంటో అర్థం చేసుకోవాలి!
ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై విద్య కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి పాపులర్ మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేశమ్ అబ్దుల్ వహబ్ సంగీతం అందిస్తుండటంతో ఆల్బమ్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి.

