రామ్‌చ‌ర‌ణ్ హీరోగా రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ మూవీ ‘పెద్ది’. ఉప్పెన చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్‌ను సొంతం చేసుకున్న ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రానికి ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు.

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్ స‌మ‌ర్ప‌ణ‌లో ‘పెద్ది’ వంటి భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా మూవీని ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా వృద్ధి సిన‌మాస్ బ్యాన‌ర్‌పై వెంక‌ట స‌తీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఇప్పటికే ప్రమోషన్స్ ప్రారంభించేసారు. బిజినెస్ సైతం మొదలైంది.

‘ఫ‌స్ట్ షాట్‌’ పేరుతో ‘పెద్ది’ చిత్రం నుంచి శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఏప్రిల్ 6న ఈ గ్లింప్స్‌ను విడుద‌లవుతుంది. ఈ అనౌన్స్‌మెంట్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేస్తే ఓ రేంజిలో క్రేజ్ వచ్చింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం బిజినెస్ కదలికలు మొదలయ్యాయి. ఈ చిత్రం ఆడియో హక్కులను 25 కోట్ల సంచలన ధరకు టి-సిరీస్ కొనుగోలు చేసింది.

టాలీవుడ్‌కి ఇది అతిపెద్ద డీల్‌లలో ఒకటి. ఈ చిత్రానికి సంగీతం ఎఆర్ రెహమాన్ స్వరపరచడంతోపాటు పాన్-ఇండియన్ చిత్రంలో చరణ్ హీరోగా నటించడంతో క్రేజ్ రెట్టింపు అయ్యింది. అలాగే, బుచ్చి బాబు సంగీత అభిరుచి (ఉప్పెన ఆడియో ఒక సంచలనాత్మక హిట్) ఈ పెద్ద డీల్ ని సెట్ అయ్యేలా చేసింది.

, , ,
You may also like
Latest Posts from