సూర్యా… స్టైల్ ఐకాన్. గొప్ప నటుడు. విభిన్న కథల పట్ల ప్రత్యేక ఆసక్తి కలిగిన స్టార్ హీరో. ఆయన సినిమా వస్తే తమిళనాడులో ఓ ఫెస్టివల్ లాగే ఉంటుంది. అలానే జరిగింది ‘రెట్రో’కు కూడా. థియేటర్లలో మంచి క్రేజ్‌తో విడుదలై, తొలి రోజే సూర్యా కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ అందుకుంది. అయితే… ఈ ఊపు మూడో రోజు కూడా ఉండలేదంటే… ఆ సినిమా డిజాస్టర్ క్రింద లెక్క!

తొలిరోజు దూసుకెళ్లినా, రెండో రోజు నుంచే బ్రేక్ !

‘రెట్రో’ కి మొదటి రోజు ప్రేక్షకుల తమిళనాట బాగానే స్పందన వచ్చింది. కానీ, రివ్యూలు, word of mouth మాత్రం మిక్స్‌డ్, లేదా అంచనాలకు తక్కువగా ఉండటంతో రెండో రోజే కలెక్షన్లు డ్రాప్ అవటం మొదలైంది. ఆశ్చర్యకరంగా మూడో రోజు కూడా అదే స్థాయిలో ఉండి, సినిమా హైప్ పూర్తిగా పడిపోయింది.

తెలుగు రాష్ట్రాల్లో ఏమయ్యింది?

తెలుగులో అయితే పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. బజ్ సరిగ్గా లేకపోవడమే కాకుండా, సినిమా కంటెంట్ కూడా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఫస్ట్ వీకెండ్ మొదటి మూడు రోజుల్లోనే పెద్ద డ్రాప్ కనిపించింది. ఓవరాల్‌గా సినిమా ఫీల్ బ్లాండ్ గా మారిపోయింది.

పూర్తి రన్‌లో ‘కంగువా’ కంటే కూడా తక్కువ వసూళ్లు?

ఇప్పటివరకు (3 రోజుల్లో) వరల్డ్‌వైడ్ కలెక్షన్లు సుమారుగా 62 కోట్లు. వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ సంఖ్య 75 కోట్ల వరకే పరిమితం అవుతుందని అంచనా. ఇది సూర్యా తాజా మైలు రాయి అనుకున్న ‘కంగువా’ కంటే చాలా తక్కువ. అదే continued trend ఉంటే, ‘రెట్రో’ బాక్సాఫీస్ డిజాస్టర్‌గా మారనుంది.

కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వం అంటే కొత్త స్టైల్, స్ట్రాంగ్ కాన్సెప్ట్, మాస్ & క్లాస్ మిక్స్. కానీ ఈసారి ఆయన కథనం, ట్రీట్మెంట్ — రెండూ మిస్ ఫైర్ అయ్యాయి. సూర్యకు ఇది “గజినీ” తరహా కం బ్యాక్ కావాల్సింది. కానీ డిజాస్టర్ అయ్యింది.

, ,
You may also like
Latest Posts from